తిన్న తర్వాత ఈ పనులు అస్సలు చేయకండి.. లేదంటే?
తిన్న తర్వాత కొన్ని పనులు చేయాలి. ఇంకొన్ని పనులను చేయకూడదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. తిన్న తర్వాత 100 అడుగులు నడిస్తే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే శరీరం ఫిట్ గా ఉంటుంది. కానీ..

నడక మన ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న ముచ్చట అందరికీ తెలుసు. వాకింగ్ ఎన్నో వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. అందుకే ప్రతిరోజూ కనీసం అర్థగంటపాటైనా నడవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే భోజనం చేసిన తర్వాత నడవడం మంచిదా? కాదా? అన్న విషయంపై చాలా మందికి ఎన్నో సందేహాలుంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది. తిన్న తర్వాత కనీసం 100 అడుగులు నడవాలని నిపుణులు సలహానిస్తున్నారు. ఈ నడక మన శరీరాన్ని ఫిట్ గా ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
walking
భోజనం తర్వాత 100 అడుగులు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జర్నల్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ప్రతి భోజనం తర్వాత కొద్దిసేపు నడక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. భోజనం చేసిన తర్వాత 15 నిమిషాలు నడవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వును కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే మరి తిన్న తర్వాత ఏ పనులను చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty
1. తిన్న వెంటనే నీటిని తాగడం మానుకోవాలి. ఎందుకంటే ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. ఇదికాస్త ఊబకాయానికి దారితీస్తుంది.
2. అలాగే తిన్న వెంటనే నిద్రపోకూడదు. ఎందుకంటే మీ శరీరంలో కొవ్వును పెంచుతుంది. అలాగే జీవక్రియను నెమ్మదింపజేస్తుంది. అలాగే దీనివల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు.
3. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి భోజనం తర్వాత ఈత కొట్టడం, ప్రయాణించడం, వ్యాయామం చేయడం వంటి పనులను కూడా మానుకోవాలి.
4. ఒకవేళ మీకు తిన్న తర్వాత టీ తాగే అలవాటు ఉంటే ఇక నుంచి దాన్ని మానేయండి. ఎందుకంటే టీ లోని టానిక్ ఆమ్లం ఆహారంలోని ప్రోటీన్, ఇనుమును గ్రహిస్తుంది. ఇది ఆహారం ద్వారా లభించే అవసరమైన ప్రోటీన్లను శరీరం పొందకుండా చేస్తుంది.