MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • మూత్రాన్ని ఆపుకోకూడదు అనేది ఇందుకే..!

మూత్రాన్ని ఆపుకోకూడదు అనేది ఇందుకే..!

మూత్రాన్ని ఆపడానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. కానీ అవన్నీ మన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి తెలుసా? అవును మూత్రాన్ని ఆపడం వల్ల మీరు ఊహించని ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 11 2023, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మూత్రం ద్వారా మన శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. నిజానికి మూత్రం మనల్ని ఎన్నో రోగాల బారి నుంచి కాపాడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మూత్రాన్ని ఆపాల్సి వస్తుంది. కానీ ఇలా మూత్రాన్ని తరచుగా ఆపడం వల్ల లేనిపోని రోగాలు వస్తాయి. కానీ అతి చురుకైన అంటే తరచుగా మూత్రం వచ్చేవారు వారి కెగెల్ కండరాలను బలోపేతం చేయడానికి మూత్రాన్ని కొద్దిసేపు ఆపాలని సలహానిస్తారు. కానీ దీనివల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. నిజమేంటంటే.. మూత్రాన్ని ఆపడం అంత మంచిది కాదు. ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అవేంటంటే.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కమ్యూనికేషన్ వ్యవస్థను విస్మరించడం

మూత్రవిసర్జన సాధారణ ప్రక్రియ. ఇందులో మూత్రాశయంలోని నరాలు పాల్గొంటాయి. మూత్రాశయం సగం నిండినప్పుడు ఈ నరాలు మెదడుకు సంకేతాన్ని పంపుతాయి. మీరు మూత్ర విసర్జన చేయాలని. కానీ మీరు మూత్రవిసర్జన చేయనప్పుడు మీ శరీరం మ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే మూత్రవిసర్జన చేయాలనిపించినప్పుడు వెంటనే చేయండి. 
 

37

అలాంటి సామర్థ్యం లేకపోవడం

కిడ్నీ అండ్ యూరాలజీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (కెయుఎఫ్ఎ) ప్రకార.. ఆరోగ్యకరమైన వయోజనుడు తన మూత్రాశయంలో రెండు కప్పుల మూత్రాన్ని నింపగలడు. మీరు ప్రెగ్నెంట్ కాకపోతే, డయాబెటిస్, యూటీఐ లేదా మూత్రపిండాలకు సంబంధించిన ఏదైనా వ్యాధితో బాధపడకపోతే.. మీరు మూత్రాన్ని నియంత్రించొచ్చు. కానీ రెండు కప్పుల కాఫీ, అర లీటరు నీరు లేదా ఒక పెద్ద గ్లాసు జ్యూస్ తాగితే ఏమవుతుందో  తెలుసా? ఇలాంటి సమయంలో మీ మూత్రాశయం నిండుతుంది. ఇలాంటి సమయంలో కూడా మీరు మూత్రవిసర్జన చేయకపోతే అసౌకర్యం కలుగుతుంది. 
 

47


యూటీఐ ప్రమాదం పెరుగుతుంది

సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. మూత్రాన్ని ఆపడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ) వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మీరు ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతుంటే అది మరింత దిగజారుతుంది. ఎందుకంటే మూత్ర విసర్జన ఆపేస్తే అందులో ఉండే బ్యాక్టీరియా మూత్రనాళంలో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇది సంక్రమణ అవకాశాలను బాగా పెంచుతుంది.

57
urine infections

urine infections

మూత్ర నియంత్రణ ఆగిపోవచ్చు

హార్వర్డ్ మెడికల్ స్కూల్లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. మూత్ర విసర్జనను ఆపడం వల్ల మీ కటి కండరాలు బలహీనపడటం మొదలవుతుంది. దీనివల్ల క్రమంగా మూత్రాన్ని నియంత్రించే సామర్థ్యం దెబ్బతిని యూరిన్ లీకేజీ సమస్య ఎక్కువవుతుంది. ఫలితంగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు కూడా మూత్రం లీక్ అవుతుంది. 
 

67

మూత్రపిండాలు ప్రమాదంలో ఉండొచ్చు

అన్నల్స్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. మూత్రవిసర్జనను ఆపే అలవాటు మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఇంతకు ముందు ఇలాంటి సమస్య ఉన్నవారిలో. ఎందుకంటే మూత్రంలో కాల్షియం ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి.  కొన్నిసార్లు మీరు మూత్రాన్ని ఎక్కువసేపు ఆపినప్పుడు అది మూత్రపిండాలకు తిరిగొస్తుంది. ఇది మూత్రపిండాలకు అస్సలు మంచిది కాదు. 
 

77

మీ మూత్రాశయం పగిలిపోవచ్చు

తరచుగా మూత్ర విసర్జనను ఆపడం వల్ల మీ మూత్రాశయం చీలిపోవడం, పగిలిపోవడం కూడా జరగొచ్చు. మీ మూత్రాశయం నిండినా మీరు మూత్ర విసర్జన చేయకపోతే ఖచ్చితంగా ఈ సమస్య వస్తుంది. దీనికి అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved