జుట్టు రాలడం వెంటనే ఆగిపోవాలంటే ఈ 4 కచ్చితంగా పాటించాలి!
Hair Care Tips: ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అందరూ జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే మీకు తెలియకుండా మీరు చేసే కొన్ని పనులు, అలవాట్లు జుట్టు రాలడానికి కారణమవుతాయి. అవేంటో? వాటిని ఎలా నివారించాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

జుట్టు రాలడం తగ్గించే చిట్కాలు
మనలో చాలామందికి రకరకాల కారణాలతో జుట్టు రాలుతుంటుంది. మనకు తెలియకుండా మనం చేసే కొన్ని పనులు జుట్టు రాలడానికి కారణమవుతాయి. వాటిని నివారిస్తే.. ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అవేంటో.. ఎలా నివారించాలో ఇక్కడ చూద్దాం.
హెల్తీ ఫుడ్
ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరానికి అవసరమైన పోషకాలు అందించడానికి సరైన ఆహారం సరైన రీతిలో కచ్చితంగా తీసుకోవాలి. భోజనం మానేయడం వల్ల జుట్టుకు అవసరమైన ప్రోటీన్లు, ఐరన్, విటమిన్లు, కొవ్వులు లభించవు. కాబట్టి పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.
అధిక ఒత్తిడి
రకరకాల కారణాలతో మనలో చాలామంది ఒత్తిడికి గురవుతుంటారు. నిజానికి అధిక ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఈ హార్మోన్ జుట్టు పెరుగుదలకు సహాయపడే కణాలను దెబ్బతీస్తుంది. దానివల్ల జుట్టు రాలిపోతుంది.
స్టైలింగ్ చేయడం
స్టైలింగ్ వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. అధిక వేడి, కెమికల్స్, జుట్టును గట్టిగా లాగే స్టైల్స్ వల్ల జుట్టు పొడిబారుతుంది. బలహీన పడుతుంది. చివరకు రాలిపోతుంది. హెయిర్ స్టైలింగ్ తరచుగా చేసేవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హెయిర్ స్టైల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. దాంతోపాటు కఠినమైన రసాయనాలు ఉన్న షాంపూలను కూడా వాడకపోవడం మంచిది.
సరైన నిద్ర
ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఫుడ్ ఒక్కటి తీసుకుంటే సరిపోదు.. మంచి నిద్ర కూడా అవసరం. నిద్ర లేమి కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. రోజుకు కనీసం 7 గంటల నిద్ర అవసరం. అలాగే శరీరానికి తగినంత నీరు తీసుకోవడం ముఖ్యం. వీటిని సరిగ్గా పాటిస్తే జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.