Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఈ లక్షణాలు క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు.. అస్సలు లైట్ తీసుకోకండి

ఈ లక్షణాలు క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు.. అస్సలు లైట్ తీసుకోకండి

క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. ఈ రోగాన్ని సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణాలు పోతాయి. అయితే ఈ వ్యాధి మన శరీరంలో ఏ భాగంలోనైనా రావొచ్చు. కొన్ని లక్షణాలతో ఈ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

Mahesh Rajamoni | Published : Sep 12 2023, 04:25 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

క్యాన్సర్ పేరు వినగానే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే నేడు ఈ వ్యాధి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. కొంతమందైతే ఈ వ్యాధి ఉన్నట్టు కూడా తెలియకుండా చనిపోతున్నారు. ఇంకొంతమందికి ఈ వ్యాధి ముదిరినంకనే తెలుస్తుంది. ఇలా తెలిసినా ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈ వ్యాధి నుంచి ప్రాణాలతో బయటపడాలంటే మాత్రం దీన్ని మొదట్లోనే గుర్తించాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ వ్యాధి మొదట్లో కొన్ని లక్షణాలను చూపిస్తుంది. వాటిని గుర్తిస్తే చికిత్స తో దీన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. 

26
Asianet Image

క్యాన్సర్లు ఎన్నో రకాలు. అయితే ఇవన్నీ వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి. ఏ క్యాన్సర్ అయినా సరే కొన్ని సాధారణ లక్షణాలను ఒకేవిధంగా కలిగి ఉంటాయి. ఇలాంటివి మీలో కనిపిస్తే ఎప్పటికీ లైట్ తీసుకోకండి. ఇంతకీ ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

36
Asianet Image

అలుపు

బాగా పనిచేయడం వల్ల అలిసిపోవడం చాలా సహజం. విశ్రాంతి తీసుకుని, కంటి నిండా నిద్రపోతే ఈ అలసట తగ్గుతుంది. ఇలా కాకుండా మీరు ఎక్కువ అలసటకు గురైనా, బలహీనంగా ఉన్నా వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి క్యాన్సర్ లక్షణాలు కావొచ్చు. 
 

46
Asianet Image

శరీరంలో గడ్డలు

క్యాన్సర్ వల్ల శరీరంలో వివిధ భాగాల్లో గడ్డలు అవుతాయి. ఈ గడ్డలు క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి. మీలో ఏ రకమైన గడ్డలు కనిపించినా వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. అలాగే మీ శరీరంలోని ఏ భాగంలోనైనా వాపు ఉంటే కూడా హాస్పటల్ కు చూపించుకోండి. ఎందుకంటే ఇది కూడా క్యాన్సర్ లక్షణమేనంటున్నారు నిపుణులు.

56
cancer

cancer

బరువు తగ్గడం

బరువు తగ్గడానికని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవ్వరూ ఫాస్ట్ గా బరువు తగ్గరు. ఎలాంటి ప్రయత్నం చేయకున్నా ఒక వ్యక్తి అకస్మాత్తుగా బరువు తగ్గితే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇది  క్యాన్సర్ కు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు. ఒక వ్యక్తి ఎలాంటి ప్రయత్నం చేయకుండా బరువు తగ్గితే వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి. 
 

66
Asianet Image

కొన్ని భాగాల్లో నొప్పి

శరీరంలో ఏదో ఒక భాగంలో నొప్పి కలగడం చాలా సహజం. అయితే చాలా సేపు నడిస్తే ఖచ్చితంగా కాళ్లలో నొప్పి వస్తుంది. కొద్ది సేపు రెస్ట్ తీసుకుంటే ఈ నొప్పి తగ్గిపోతుంది. కానీ మీ శరీరంలోని ఏదో ఒక భాగంలో ఎప్పుడూ నొప్పి వచ్చినా.. మందులను వాడినా అది తగ్గకపోయినా మీరు ఖచ్చితంగా చెకప్ లు చేయించుకోవాలి. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories