Health Tips: మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలతో ఆ సమస్యను దూరం పెట్టండి?
Health Tips: నేటి ఉరుకుల పరుగుల జీవితం, జాబ్ టార్గెట్స్ మొదలైన వాటి వల్ల దాదాపు అందరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ విధంగా ప్రయత్నించమంటున్నారు మనస్తత్వ నిపుణులు అవేంటో చూద్దాం.

మంత్లీ టార్గెట్స్ రీచ్ అవ్వడం కోసం టెన్షన్, ఫ్యామిలీ రిలేషన్స్ నిలబెట్టుకోవడం కోసం టెన్షన్, బిజినెస్ లో గ్రో అవడం కోసం టెన్షన్. ఇలా ప్రతి మనిషి ఏదో ఒక విషయం కోసం టెన్షన్ పడుతూనే ఉంటాడు. అయితే ఆ టెన్షన్ ఒక పరిధి దాటితే రక్తపోటు, మధుమేహం, గుండెపోటు కి దారి తీసే అవకాశాలు ఉన్నాయి.
ఒత్తిడి ముదిరి డిప్రెషన్ కి దారి తీయడం వలన ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అలా అని నేటి పోటీ ప్రపంచంలో స్థబ్దుగా ఉండిపోవటానికి కూడా అవ్వదు. కాలంతోపాటు పరుగులు తీయాల్సిందే. కాబట్టి ఒత్తిడిని నివారించడం వీలుకాదు.
కాబట్టి ఉపశమనం పొందడం నేర్చుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక పని చేసే ముందు ఎలా చేయాలి అన్న ఒక ప్రణాళిక వేసుకోండి. మీరు పనిచేసే చోటు మీకు ఇబ్బంది పెట్టేవి ఉండకుండా చూసుకోవాలి. ఇబ్బంది పెట్టే సందర్భం ఏదైనా వస్తే యాక్సెప్ట్ చేయండి.
లేదా అవాయిడ్ చేయండి. అంతేగాని మధ్యలో నలిగిపోకండి. అలాగే ప్రస్తుత జీవనశైలిలో నిద్ర వేళలు క్రమంగా తగ్గుతున్నాయి. కనీసం మనిషి రోజుకి 7 నుంచి 8 గంటల నిద్ర ఉండాలి కాబట్టి ఆ నిద్ర తగ్గకుండా చూసుకోవడం చాలా అవసరం. అందుకోసం యోగ మెడిటేషన్ వంటివి చేయండి.
అలాగే రన్నింగ్, వాకింగ్ వంటి ఒత్తిడి తగ్గే వ్యాయామాలు చేయండి. ఏ వ్యాయామం చేసినా 45 నిమిషాల పాటు చేయడం వలన ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాలు ఎక్కువగా తీసుకోండి ఇందులో ఉండే పొటాషియం కండరాల నొప్పుల్ని తగ్గిస్తుంది.
Image: Getty
అలాగే ప్రోటీన్లు విటమిన్స్ తో కూడుకున్న ఆహారాన్ని తీసుకోవటం వలన మెదడుకి ఎంతో ప్రశాంతత ఉంటుంది. ఇష్టమైన వారితో గడపటం, నచ్చిన పని చేయటం వలన ఒత్తిడిని జయించవచ్చు. ఒత్తిడి స్థాయి పెరిగితే మాత్రం తప్పనిసరిగా వైద్య నిపుణులని సంప్రదించండి.