MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • దానిమ్మ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమో తెలుసా?

దానిమ్మ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమో తెలుసా?

దానిమ్మలో (Pomegranate) గింజలు చూడడానికి ఎర్రగా ఉంటూ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. దానిమ్మ మంచి పోషక పదార్థాలను కలిగి ఉంటాయి. దానిమ్మ చెట్టులోని ప్రతి భాగం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉండి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తాయి. నిత్యం దానిమ్మ తింటే ఆరోగ్యానికి  మంచిది. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా దానిమ్మ శరీరానికి కలుగజేసే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. 

2 Min read
Navya G | Asianet News
Published : Dec 10 2021, 08:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

దానిమ్మలో విటమిన్ బి, సి, కె, ఇంకా యాంటీఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్లు (vitamins) వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. శరీర అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. దానిమ్మ గింజలు, అధిక రక్తపోటు, ఎక్కువ కొలెస్ట్రాల్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపులు వంటి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలను నియంత్రించటం, తగ్గించటం చేస్తాయి. దానిమ్మ శరీర ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
 

28
pomegranate

pomegranate

దీర్ఘకాలిక దగ్గులను తగ్గిస్తుంది: దానిమ్మ రసంలో అల్లం రసం, తేనె కలుపుకుని తాగితే దీర్ఘకాలిక దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా తరచూ చేస్తే దీర్ఘకాలిక దగ్గు (Chronic cough) నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది దగ్గు తగ్గించే మంచి ఔషధమని (Medicine) వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

38

ముక్కు నుంచి రక్తంకారే సమస్యలను తగ్గిస్తుంది: శరీరంలో అధిక వేడి (Excess heat in the body) కారణంగా కొందరిలో ముక్కు నుంచి రక్తం కారుతుంటుంది. ఈ సమస్య వారిని చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. అలాంటప్పుడు దానిమ్మ పువ్వులను దంచి రసం (Pomegranate flowers juice) తీసి ఆ రసాన్ని కొంచెం ముక్కు రంధ్రాలలో వేస్తే ముక్కు నుంచి రక్తం కారే సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.
 

48

లైంగిక కోరికలను పెంచుతుంది: దానిమ్మ గింజలలోని పోషకాలు మూడ్ ను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ పోషకాలు రక్తప్రసరణను పెంచి అంగస్తంభన సమస్యలను నయంచేసి టెస్టోస్టిరాన్ హార్మోన్ (Testosterone hormone) స్థాయిని పెంచి లైంగిక కోర్కెలను (Sexual desires) పెంచుతాయి. శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనేలా చేస్తాయి. 
 

58

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: దానిమ్మ గింజలలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ (Good cholesterol) పనితీరును మెరుగుపరిచి హానికరమైన కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండెకు సంబంధించిన వ్యాధులను నియంత్రించడానికి, తగ్గించడానికి సహాయపడతాయి. 
 

68
pomegranate

pomegranate

క్యాన్సర్ ను నివారిస్తుంది: దానిమ్మ జ్యూస్ తాగితే క్యాన్సర్ తగ్గే అవకాశాలు ఉంటాయి. దానిమ్మలో ఉండే క్యాన్సర్ (Cancer) వ్యతిరేక లక్షణాలు కాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టి క్యాన్సర్ నివారణకు సహాయపడతాయి. శరీరానికి క్యాన్సర్ తో పోరాడే శక్తిని (Fighting power) అందిస్తుంది.

78
pomegranate

pomegranate

జీర్ణశక్తిని పెంచుతుంది: దానిమ్మలో బీ-కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి జీర్ణక్రియను (Digestion) సులభతరం చేస్తుంది. ఇది మలబద్ధకం సమస్యలను కూడా నివారిస్తుంది.

88

దానిమ్మను మనం నిత్యం తీసుకుంటే కీళ్ల నొప్పులు, కడుపునొప్పి (Stomach ache), కడుపుబ్బరం, మధుమేహం (Diabetes) వంటి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తగ్గడంతో పాటు శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Mineral Water: మినరల్ వాటర్‌ను వేడిచేసి తాగడం మంచిదా? కాదా? తాగితే ఏమవుతుంది?
Recommended image2
Lifestyle: ఎక్కువ కాలం బ‌త‌కాల‌ని ఉందా.? రోజూ ఈ 4 ప‌నులు చేయండి చాలు
Recommended image3
ఎముకలు బలంగా ఉండాలంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved