నానబెట్టిన ఎండు ద్రాక్షలను ఉదయంపూట తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?
అందరి ఇంటిలో డ్రైఫ్రూట్ రూపంలో అందుబాటులో ఉండే ఎండు ద్రాక్ష (Raisins) అనేక న్యూట్రీషియన్స్ ను కలిగి శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే నీటిలో నానబెట్టిన ఎండు ద్రాక్షలను పరిగడుపున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

ఎండుద్రాక్షలు ఉండే పోషకాలు శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని అందించి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఎండు ద్రాక్ష మంచి హెల్తీ ప్రోటీన్. అయితే ఎండుద్రాక్షలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల (Health benefits) గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఎండు ద్రాక్షలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎండు ద్రాక్షలో క్యాలరీలు (Calories) అధికంగా ఉంటాయి. కనుక మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. 10 ఎండుద్రాక్షలను రాత్రంతా నీటిలో నానబెట్టి (Soaked) ఉదయం పరగడుపున తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయి. అయితే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది: ఎండు ద్రాక్షలో క్యాల్షియం (Calcium), మైక్రో న్యూట్రీషియన్స్ (Micronutrients) పుష్కలంగా ఉంటాయి. కనుక ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తాయి.
కంటి చూపును మెరుగుపరుస్తుంది: ఎండు ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), విటమిన్ ఏ, బీటా కెరోటిన్ (Beta carotene) లు కంటి చూపును మెరుగు పరచడానికి సహాయపడతాయి.
అనీమియా: రక్తహీనత (Anemia) సమస్యలతో బాధపడేవారికి ఎండుద్రాక్ష మంచి ఔషధంగా సహాయపడుతుంది. ఎండుద్రాక్షలో ఐరన్ కంటెంట్ (Iron content) పుష్కలంగా ఉంటుంది. కనుక అనీమియా సమస్య ఉండదు.
జీర్ణశక్తిని పెంచుతుంది: ఎండు ద్రాక్షలో ఫైబర్ (Fiber) పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని (Digestion) పెంచి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మలబద్దక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది: ఎండుద్రాక్షలో విటమిన్లు, ప్రొటీన్లు (Proteins) పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచి వ్యాధినిరోధక శక్తిని (Immunity) పెంచుతాయి .
నోటి దుర్వాసనను తగ్గిస్తాయి: ఎండు ద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ (Antibacterial) లక్షణాలు అధికంగా ఉంటాయి. బ్యాక్టీరియా కారణంగా ఏర్పడే నోటి దుర్వాసనను (Bad breath) తగ్గించి తాజా శ్వాసను అందిస్తాయి.
raisins
గుండె పనితీరును మెరుగుపరుస్తాయి: ఎండు ద్రాక్షలో ఫైబర్ కంటెంట్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ (Cholesterol levels) ను కంట్రోల్లో ఉంచి గుండె పనితీరును (Heart function) మెరుగుపరుస్తాయి.
ఎనర్జీని అందిస్తుంది: శారీరక శ్రమ కారణంగా అలసిపోయిన శరీరానికి తక్షణ శక్తిని (Instant power) అందించేందుకు ఎండు ద్రాక్షలోని పోషకాలు సహాయపడతాయి. ఎండు ద్రాక్ష శరీరానికి శక్తినందించే మంచి ఎనర్జీ బూస్టర్ (Energy booster) గా సహాయపడుతుంది.
కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఎండు ద్రాక్షలను రోజు మన డైట్ లో తీసుకుంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ (Kidney infection), కిడ్నీ వంటి సమస్యలకు దూరంగా ఉంచి కిడ్నీ ఆరోగ్యాన్ని (Kidney health) మెరుగు పరుస్తుంది.