టేస్టీ హనీ కేక్.. ఇలా చేస్తే సూపర్ టెస్ట్!
బర్త్ డే, ఫంక్షన్లకు కేక్ ను బయటి నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా ఎంతో సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

కేక్ తయారీ విధానం చాలా కష్టమని అనుకోకండి. తక్కువ పదార్థాలతో (Less ingredients) ఎంతో సులభంగా హనీ కేక్ (Honey cake) ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ కేక్ చాలా స్మూత్ గా భలే టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ కేక్ తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: ఒక కప్పు మైదా (Maida), సగం కప్పు పెరుగు (Curd), సగం కప్పు పంచదార (Sugar), పావుకప్పు నూనె (Oil), సగం టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ (Vanilla essence), ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ (Baking powder), సగం టీ స్పూన్ వంట సోడా (Cooking soda), సగం కప్పు పాలు (Milk), రెండు టేబుల్ స్పూన్ ల తేనె (Honey), మూడు టేబుల్ స్పూన్ ల ఫ్రూట్ జామ్ (Fruit jam), రెండు టేబుల్ స్పూన్ ల పచ్చికొబ్బరి (Raw coconut) తురుము.
తయారీ విధానం: ఒక గిన్నె తీసుకుని అందులో పెరుగు, పంచదార, నూనె, వెనిలా ఎసెన్స్ వేసి చక్కెర అంతా బాగా కలిసిపోయేంతవరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జల్లెడలో మైదా, వంటసోడా, బేకింగ్ సోడా వేసి జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకున్న మైదా పిండిని ముందుగా కలుపుకున్న చక్కెర మిశ్రమంలో వేసి ఒకే డైరెక్షన్ లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చుకున్న పాలు వేసి ఉండలు కట్టకుండా ఒకే డైరెక్షన్ (One direction) లో బాగా కలుపుకోవాలి (Mix well).
ఇలా మిశ్రమాన్ని ఒకే డైరెక్షన్ లో కలుపుకుంటే కేక్ బాగా స్మూత్ గా వస్తుంది. ఇప్పుడు కేక్ మిశ్రమాన్ని నూనె రాసి పొడి పిండి చల్లుకున్న అల్యూమినియం కేక్ గిన్నెలో (Aluminum cake bowl) వేసుకోవాలి. కేక్ మిశ్రమాన్ని గిన్నెలో ముప్పావు భాగం మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో స్టాండ్ పెట్టి మూత పెట్టుకొని విజిల్ లేకుండా (Without whistle) ఐదు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి.
ఐదు నిమిషాల తరువాత కుక్కర్ మూత తీసి కేక్ గిన్నెను స్టాండ్ పై పెట్టి మూత పెట్టి విజిల్ లేకుండా అరగంటపాటు తక్కువ మంట (Low flame) మీద కుక్ చేసుకోవాలి. కేక్ తయారు కావడానికి 35- 40 నిమిషాల సమయం పడుతుంది. అరగంట తరువాత టూత్ పిక్ సహాయంతో కేక్ తయారు అయిందో లేదో పరీక్షించుకోవాలి. కేక్ తయారైన తరువాత బాగా చల్లారనివ్వాలి (Let cool). ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి అందులో పావు కప్పు నీళ్లు, రెండు స్పూన్ ల చక్కర వేసి వేడి చేసుకోవాలి.
చక్కెర కరిగి ఒక పొంగు వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కెర పాకాన్ని (Sugar candy) చల్లారనివ్వాలి. పాకం చల్లారాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టూత్ పిక్ తో కేకును గుచ్చి తరువాత హనీ సిరప్ ను అప్లై చేసుకోవాలి. ఇలా కేకు కు రంద్రాలు చేస్తే లోపల వరకు సిరప్ వెళుతుంది. ఇప్పుడు కడాయిలో ఫ్రూట్ జామ్, ఒక స్పూన్ నీళ్లు వేసి తక్కువ మంట (Low flame) మీద కలుపుతూ వేడి చేసుకోవాలి.
జామ్ పూర్తిగా కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని తేనె (Honey) కలుపుకొని ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు కేక్ పై అప్లై చేసుకోవాలి. చివరిలో పచ్చికొబ్బరి తురుముతో గార్నిష్ (Garnish) చేస్తే కేక్ భలే కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే స్మూతీ హనీ కేక్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కేక్ ని ఒకసారి ట్రై చేయండి.