సాంబార్ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి!
సాంబార్ పుల్లపుల్లగా స్పైసీగా (Spicy) భలే రుచిగా ఉంటుంది. అయితే మనం ఇంట్లో చేసుకునే సాంబార్, పెళ్లిళ్లలో చేసే సాంబార్ టేస్ట్ వేరు వేరుగా ఉంటాయి.

Sambar
మనం పెళ్లిళ్ల స్టైల్ సాంబార్ ను ఇంట్లోనే ట్రై చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం పెళ్లిళ్ల స్టైల్ సాంబార్ (Sambar) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు (Kandi pappu), పావు కప్పు పెసర పప్పు (Pesara Pappu), పది చిన్న సాంబార్ ఉల్లిపాయలు (Sambar onions), రెండు టమోటాలు (Tomatoes), పావు కప్పు బీన్స్ (Beans) ముక్కలు, రెండు పచ్చిమిరపకాయలు (Chilies), పావు కప్పు సొరకాయ (Sora kaya) ముక్కలు.
పది ములక్కాడ (Mulakkada) ముక్కలు, సగం క్యాప్సికం (Capsicum) ముక్కలు, ఒక వంకాయ (Brinjal), ఒక క్యారెట్ (Carrot), ఒక టేబుల్ స్పూన్ కారం (Chili powder), సగం కప్పు చింతపండు రసం (Tamarind juice), రెండు టీ స్పూన్ ల సాంబార్ పౌడర్ (Sambar powder), ఒక టీ స్పూన్ ఆవాలు (Mustard), పావు స్పూన్ మెంతులు (Fenugreek), పావు టీ స్పూన్ ఇంగువ (Asparagus).
కొన్ని కరివేపాకులు (Curries), కొత్తిమీర (Coriander) తరుగు, ఒక టేబుల్ స్పూన్ బెల్లం (Jaggery), రుచికి సరిపడా ఉప్పు (Salt), పావు టీ స్పూన్ పసుపు (Turmeric), మూడు ఎండు మిరపకాయలు (Chilies), సగం స్పూన్ జీలకర్ర (Cumin), నాలుగు వెల్లుల్లి (Garlic) రెబ్బలు, రెండు టేబుల్ స్పూన్ ల నూనె (Oil), రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee).
తయారీ విధానం: కుక్కర్ తీసుకొని అందులో గంటసేపు కడిగి నానబెట్టిన (Soaked) కందిపప్పు, పెసరపప్పు, పసుపు, మూడు కప్పుల నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి (Cook until soft). పప్పు మెత్తగా ఉడికిన తరువాత బాగా చిదుముకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడెక్కిన తరువాత ఆవాలు, మెంతులు, ఇంగువా, కరివేపాకులు, సాంబార్ ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి.
ఉల్లిపాయలు మగ్గిన తరువాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, సొరకాయ, ములక్కాడ, క్యాప్సికం, గుమ్మడికాయ, క్యారెట్, టమోటా ముక్కలను వేసి రెండు నిమిషాలపాటు మూత పెట్టి వేపుకోవాలి. కూరగాయలు (Vegetables) బాగా మగ్గిన తరువాత చింతపండు రసం, కారం, సాంబార్ పౌడర్, బెల్లం ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి (Mix well).
అలాగే ఇందులో ముందుగా ఉడికించుకున్న పప్పును కూడా వేసి నీళ్లు పోసి మూత పెట్టి తక్కువ మంట (Low flame) మీద సాంబార్ ను బాగా ఉడికించుకోని చివరిలో కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు పోపుకోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి వేడెక్కిన తరువాత ఆవాలు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులను వేసి వేయించుకుని సాంబార్ కు పోపు పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) పెళ్లిళ్ల స్టైల్ సాంబార్ రెడీ.