ఆలూ బఠానీ మసాలా కూర.. ఇలా చేస్తే రుచిగా ఉంటుందట!
ఆలూ, బఠానీలతో చేసుకునే మసాలా కూర చాలా స్పైసీగా (Spicy), రుచిగా ఉంటుంది.

ఈ మసాలా కూర పులావ్, జీరా రైస్, అన్నం, చపాతి, రోటీలతో తీసుకుంటే తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఈ మసాలా కూరను వంటరాని వారు కూడా ఎంతో సులభంగా వండుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఆలూ బఠానీ మసాలా కూర (Aloo Pea Masala Curry) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: రెండు బంగాళదుంపలు (Potatoes), సగం కప్పు పచ్చి బఠానీలు (Green peas), రెండు ఉల్లిపాయలు (Onions), రెండు పచ్చిమిరపకాయలు (Green chilies), రెండు టమోటాలు (Tomatoes), ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), పావు స్పూన్ పసుపు (Turmeric), సగం స్పూన్ జీలకర్ర (Cumin).
రుచికి సరిపడా ఉప్పు (Salt), సగం స్పూన్ గరం మసాలా (Garam masala), ఒక టేబుల్ స్పూన్ కారం పొడి (Chilli powder), సగం స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), సగం స్పూన్ ధనియాల పొడి (Coriander powder), కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, నాలుగు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
తయారీ విధానం: ముందుగా బంగాళాదుంపలను బాగా శుభ్రపరచుకొని తొక్క తీసి (Peel off) చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు, నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి (Cook well). బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు బాగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని నీళ్లు వంపి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి వేగిన తరువాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగువేసి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై (Fry) చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన (Raw smell) పోయేంతవరకు ఫ్రై చేసుకోని పసుపు, గరం మసాలా, కారం పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడు ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
మసాలాలన్నీ బాగా వేగిన తరువాత టమోటా పేస్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి తక్కువ మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టమోటా పేస్ట్ వేగిన తరువాత ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు, పచ్చి బఠానీలు, ఒక గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు తక్కువ మంట (Low flame) మీద ఉడికించుకోవాలి. కూర బాగా ఉడికి కూర నుంచి నూనె పైకి తేలే సమయంలో కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) స్పైసీ ఆలూ మసాలా కూర రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి.