MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • టేస్టీ ఆకుకూర పప్పు.. ఇలా చేస్తే రుచి అదుర్స్!

టేస్టీ ఆకుకూర పప్పు.. ఇలా చేస్తే రుచి అదుర్స్!

ఆకుకూరలలో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

2 Min read
Author : Navya G
Published : Jul 02 2022, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఎదిగే పిల్లల ఆరోగ్యం కోసం ఆకుకూరలను ఏదో విధంగా వారికి అందించడం ముఖ్యం. కనుక ఆకుకూరలతో పప్పు చేసుకుంటే పిల్లలకు కావలసిన పోషకాలు (Nutrients) పుష్కలంగా లభిస్తాయి. ఆకుకూరలతో చేసుకునే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును ఎంతో సులభంగా తక్కువ సమయంలో వండుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఆకుకూర పప్పు (Akukura pappu) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కావలసిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు (Red gram), ఒక కట్ట పాలకూర (Lettuce), ఒక కట్ట మెంతిఆకు (Menthiaku), ఒక కట్ట తోటకూర (Asparagus), ఒక పెద్ద ఉల్లిపాయ (Onion), నాలుగు టమోటాలు (Tomatoes), పది నుంచి పదిహేను పచ్చి మిరపకాయలు (Chilies), కొద్దిగా చింతపండు (Tamarind), పావు స్పూన్ పసుపు (Turmeric).
 

37

రుచికి సరిపడా ఉప్పు (Salt), పదిహేను వెల్లుల్లి (Garlic) రెబ్బలు,  కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, సగం స్పూన్ ఆవాలు (Mustard), సగం స్పూన్ జీలకర్ర (Cumin), రెండు ఎండు మిరపకాయలు (Dried chillies), రెండు కరివేపాకు (Curries) రెబ్బలు, నాలుగు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
 

47

తయారీ విధానం: కుక్కర్ తీసుకొని అందులో  కడిగిన కందిపప్పు, పాలకూర, మెంతిఆకు తోటకూర, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఉల్లిపాయ తరుగు, పచ్చి మిరపకాయలు, టమోటా ముక్కలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర తరుగు, కొద్దిగా నూనె (Oil), మూడు గ్లాసుల నీళ్లు (Water) పోసి కుక్కర్ మూత పెట్టి ఎక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
 

57

కుక్కర్ విజిల్స్ నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ఆవిరి (Steam) పోయాక మూత తీసి పప్పు గిత్తతో పప్పును మెదుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడేక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై (Fry) చేసుకోవాలి.
 

67

తరువాత కరివేపాకు రెబ్బలు, ఎండు మిరపకాయలను వేసి ఫ్రై చేసుకుని పప్పుకు పోపు పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) నోరూరించే ఆకుకూర పప్పు రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. మీ పిల్లలు ఈ పప్పును మళ్లీమళ్లీ అడిగి చేయించుకుని తినడానికి ఇష్టపడతారు (Love to eat).
 

77

ఈ పప్పు తయారీలో ఉపయోగించే పాలకూర మెంతిఆకు తోటకూర జీనాస్య ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మలబద్దకు సమస్యలను తగ్గిస్తాయి. అలాగే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కనుక ఆరోగ్యకరమైన పద్ధతిలో ఎక్కువ పోషకాలు ఉండే వంటలను వండుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Jaggery: బెల్లం ఎలా తింటున్నారు..? ఇలా తింటేనే ప్రయోజనం ఉంటుంది
Recommended image2
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image3
అంగస్తంభన సమస్య గుండె జబ్బుకు సంకేతమా? పురుషులు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ని హెచ్చ‌రిక‌లివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved