పెరుగుతో బెండకాయ మసాలాను ఇలా ట్రై చేయండి.. రుచి అదిరిపోతుంది!
ఇంట్లో బెండకాయలు అందుబాటులో ఉంటే బెండకాయ వేపుడు, బెండకాయ సాంబార్ వంటి వంటలు ముందుగా గుర్తొస్తాయి.

ఈసారి రొటీన్ గా చేసుకునే బెండకాయ వంటలకు బదులుగా ఈ సారి కాస్త వెరైటీగా పెరుగుతో బెండకాయ మసాలాను ట్రై చేయండి. ఈ దహీ భీండీ మసాలా (Dahi Bhindi Masala) చాలా రుచిగా (Delicious) ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఈ మసాలా రెసిపీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: అర కేజీ బెండకాయలు (Ladies fingers), రెండు కప్పుల పెరుగు (Yogurt), రెండు ఉల్లిపాయలు (Onions), ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి (Ginger Garlic) తరుగు, ఒక స్పూన్ ఆవాలు (Mustard), పావు స్పూన్ మెంతులు (Fenugreek), ఒక స్పూన్ జీలకర్ర (Cumin), సగం స్పూన్ పసుపు (Turmeric).
తగినంత కారం (Chili powder), రుచికి సరిపడా ఉప్పు (Salt), ఒక స్పూన్ ధనియాల పొడి (Coriander powder), ఒక స్పూన్ గరం మసాల (Garam masala), కొన్ని కరివేపాకులు (Curries), కొత్తిమీర (Coriander) తరుగు, ముప్పావు కప్పు నూనె (Oil).
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి రెండు స్పూన్ ల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి తరుగు వేసి వేయించుకుని చల్లారాక మిక్సీ జార్ లో వేసి కొన్ని నీళ్ళు (Water) కలిపి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి.
ఇప్పుడు మరోసారి స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా నూనె (Oil) వేసి వేడెక్కిన తరువాత పొడవుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి ఎర్రగా వేయించుకుని (Fried) ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్ ల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకులు వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాల, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని తక్కువ మంట (Low flame) మీద పెట్టి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా నీళ్ళు పోసి గ్రేవీలా (Gravy) ఉడికించుకోవాలి.
ఇది గ్రేవీలా తయారయ్యాక బాగా గిలకొట్టిన పెరుగు (Scrambled yogurt), ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. బెండకాయ ముక్కలు వేగిన తరువాత చివరిలో కొత్తిమీర (Coriander) తరుగు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన దహీ భీండీ మసాలా రెడీ.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ మసాలా రెసిపీ అన్నంలోకే కాదు పులావ్, చపాతీ లాంటివాటితోనూ తినవచ్చు. ఇలా బెండకాయలతో కొత్త రుచులు (New flavors) ట్రై చేస్తే మీ కుటుంబ సభ్యులు తినడానికి ఇష్టపడతారు (Love to eat).