టమోటా పెరుగు కూర ఇలా చేస్తే టెస్ట్ అదిరిపోతుంది తెలుసా?
వేసవి కాలంలో చల్లని పెరుగు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే వంటింటిలో పెరుగు అందుబాటులో ఉన్నప్పుడు దద్ద్యోజనం, మజ్జిగ చేసుకుని తీసుకుంటాం.కానీ పెరుగుతోనూ కూరలు వండొచ్చు.

పెరుగు, టమోటాల కాంబినేషన్ (Combination) లో చేసుకునే కూర చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం టమోటా పెరుగు కూర (Tomato yogurt curry) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
పెరుగు శరీరంలోని వేడిని తగ్గించి చల్లబరుస్తుంది.అలాగే వేసవి కాలంలో ఎదురయ్యే వడదెబ్బ (Sunstroke) సమస్యలకు దూరంగా ఉంచుతుంది. కనుక పెరుగుతో కూరలు చేసుకుని కొత్త రుచులను (New flavors) ఆస్వాదించండి. ఈ కూర అన్నం, చపాతీలో బాగుంటుంది. ఈ కూర తయారీ విధానం కూడా సులభం. మీ కుటుంబ సభ్యులకు ఈ రెసిపీ తప్పక నచ్చుతుంది.
కావలసిన పదార్థాలు: అర కేజీ టమోటాలు (Tomatoes), ఒకటిన్నర కప్పు పెరుగు (Yogurt), మూడు టేబుల్ స్పూన్ ల సెనగపప్పు (Senagapappu), రెండు ఉల్లిపాయలు (Onions), ఐదు పచ్చిమిరపకాయలు (Chilies), రుచికి సరిపడా ఉప్పు (Salt).
సగం స్పూన్ ఆవాలు (Mustard), సగం స్పూన్ జీలకర్ర (Cumin), పావు స్పూన్ పసుపు (Turmeric), కొన్ని కరివేపాకులు (Curries), రెండు ఎండు మిరపకాయలు (Dried chillies), కొత్తిమీర (Coriander) తరుగు, రెండు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
తయారీ విధానం: ముందుగా సెనగపప్పును (Senagapappu) గంట ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ ల నూనె (Oil) వేసి వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకులు వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న సెనగపప్పు (Soaked senagpappu) వేసి కలుపుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, టమోటా ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మగ్గించాలి. టమోటా ముక్కలను బాగా మెత్తగా ఉడికించుకోవాలి (Cook until soft).
టమోటాలు బాగా ఉడికిన తరువాత ఇందులో కొత్తిమీర (Coriander) తరుగు వేసి మరోసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తయారుచేసుకున్న టమోటా కూర పూర్తిగా చల్లారాక బాగా గిలకొట్టిన పెరుగు (Scrambled yogurt) వేసి కలుపుకోవాలి.
అంతే ఎంతో రుచికరమైన (Delicious) నోరూరించే టమోటా పెరుగు కూర రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ రుచికి తిరుగుండదు. పెరుగు తినడానికి ఇష్టపడని పిల్లలకు ఇలా కూర చేసి పెడితే వారు ఏ పేచీ లేకుండా తినడానికి ఇష్టపడతారు (Love to eat).
ఈ రెసిపీ శరీరానికి చలువను ఇస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇలా పెరుగుతో (Yogurt) చేసుకునే కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది (Good for health). అప్పుడే అధిక ఎండ తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకోగలం.