ఎంతో రుచికరమైన కొర్రల ఉప్మా ఇంట్లోనే ఎలా తయారు చెయ్యాలో తెలుసా?
ఉప్మా తయారీలో మనం ఎక్కువగా బొంబాయి రవ్వని, గోధుమ రవ్వ, సేమియా ఉపయోగిస్తుంటాం. ఎప్పుడు వీటితోనే ఉప్మా తయారు చేస్తుంటే ఉప్మా తినాలని ఆసక్తి తగ్గుతుంది. కాస్త కొత్తగా ట్రై చేస్తే కుటుంబ సభ్యులకు తినాలని కోరిక ఉంటుంది. అయితే ఈ సారి రొటీన్ గా చేసుకునే ఉప్మాకు స్వస్తి చెప్పి ఈసారి కాస్త వెరైటీగా, హెల్తీగా కొర్రలతో ఉప్మా ట్రై చెయ్యండి. కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచిది. కొర్రలతో తయారు చేసుకుని ఉప్మా ఒక మంచి హెల్తీ బ్రేక్ ఫాస్ట్. దీని తయారీ విధానం కూడా సులభం. ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఎంతో సులభంగా తయారు చేసుకునే కొర్రల ఉప్మా (Korrala uppma) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: ఒక కప్పు కొర్రలు (Korralu), ఉల్లిపాయ (Onion) ఒకటి, టమోటా (Tomato) ఒకటి రెండు పచ్చిమిరపకాయలు (Chillies), కరివేపాకు (Curries), అల్లం (Ginger) తరుగు, క్యారెట్ (Carrot) ఒకటి, పచ్చి బఠాణీలు (Green peas) పావు కప్పు, బీన్స్ (Beans) తరుగు ఒక టేబుల్ స్పూన్, పసుపు (Turmeric) చిటికెడు, ఉప్పు (Salt) రుచికి కావాల్సినంత, పోపుకు సరిపడా ఆయిల్ (Oil), పావు కప్పు కొబ్బరి తురుము (Coconut grater), కొత్తిమీర (Coriyander), ఒక స్పూన్ మినప్పప్పు (Minappappu), ఒక స్పూన్ శనగపప్పు (Senagapappu), సగం చెంచా ఆవాలు (Mustard), రెండున్నర కప్పుల నీళ్లు (Water).
తయారీ విధానం: ముందుగా కొర్రల్ని (Korralu) రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ను స్టవ్ మీద పెట్టి అందులో పోపుకు సరిపడా ఆయిల్ (Oil) వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి.
పోపుదినుసులు వేగిన తరవాత ఇందులో అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఉల్లిపాయ (Onion) ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో క్యారెట్ ముక్కల, బీన్స్ తరుగు, పచ్చి బఠానీలు, టమోటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి (Mix well).
రెండు నిమిషాల తర్వాత ఇందులో చిటికెడు పసుపు ముందుగా నానబెట్టుకున్న కొర్రలు, రుచికి సరిపడా ఉప్పు (Salt) వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు కొర్రలకు రెండున్నర కప్పుల నీళ్లు (Water) పోసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయాక మూత తీసి ఇందులో కొబ్బరి తురుము, కొత్తిమీర తురుము వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) కొర్రలతో ఉప్మా రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రిసిపిని ట్రై చేయండి. బరువు తగ్గాలనుకునేవారు ఈ ఉప్మాను డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం వుంటుంది.