MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ముందుకి కాకుండా.. వెనక్కి నడిస్తే ఏమౌతుందో తెలుసా?

ముందుకి కాకుండా.. వెనక్కి నడిస్తే ఏమౌతుందో తెలుసా?

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరూ ముందుకే నడుస్తారు. కానీ వెనక్కి నడవడం వల్ల మనం బోలెడు లాభాలను పొందుతాం తెలుసా? అవును వెనక్కి నడవడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గడం నుంచి ఎన్నో లాభాలను పొందుతామంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 04 2024, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వెనక్కి నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు

వెనక్కి నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు

 వాకింగ్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతిరోజూ వాకింగ్ చేయడం వల్ల మనం బరువు తగ్గుతాం. శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. ఇందుకోసం మనం ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోతాం.

కానీ ముందుకి కాకుండా.. వెనక్కి నడిస్తే ఏమౌతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ముందుకి కాకుండా వెనక్కి నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వెనక్కి నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు

వెనక్కి నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు

 పలు పరిశోధనల ప్రకారం.. ముందుకు నడవడం కంటే వెనక్కి నడవడం వల్లే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వెనక్కి నడవడం వల్ల బరువు తగ్గడం నుంచి మోకాళ్ల నొప్పులు తగ్గడం వరకు ఎన్నో వ్యాధులు దూరమవుతాయని నిపుణులు అంటున్నారు. అసలు వెనక్కి నడవడం వల్ల ఎలాంటి జబ్బులు తగ్గిపోతాయంటే?

 

34
వెనక్కి నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు

వెనక్కి నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు

వెనక్కి నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి:

ఒక వయసు వచ్చిన తర్వాత మోకాళ్ల నొప్పులు రావడం చాలా సహజం. కానీ ఈ మోకాళ్ల నొప్పుల వల్ల నడవడమే కాదు.. కూర్చోవడం, పడుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే మీరు రోజూ కాసేపు ముందుకి కాకుండా వెనక్కి  నడిస్తే గనుక మోకాళ్ల నొప్పులు చాలా వరకు దూరమవుతాయి.

వెనక్కి నడవడం వల్ల మోకాళ్ల వాపు, నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయని పరిశోధనలు కనుగొన్నాయి. కాళ్లకు గాయలు లేదా కీళ్లవాతం ఉన్నవారు ఇలా వెనక్కి నడిస్తే మంచి జరుగుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 

నడుము నొప్పి తగ్గుతుంది:

నడుము నొప్పి చిన్న సమస్య అయితే కాదు. దీనివల్ల ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే నడుము నొప్పితో బాధపడేవారికి కూడా రివర్స్ వాకింగ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కొన్ని నిమిషాలు వెనక్కి నడిస్తే నడుము నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఇది నడుము కండరాలకు మంచి వ్యాయామం కూడా అవుతుంది. వెనక్కి నడవడం వల్ల వెన్నెముకకు తక్షణ ఉపశమనం అందుతుంది. 

44
వెనక్కి నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు

వెనక్కి నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు

కాళ్లను బలంగా చేస్తుంది:

ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు మీరు వెనక్కి నడవడం వల్ల కాళ్లు బలంగా అవుతాయి. ఈ రివర్స్ వాకింగ్ మీ కాళ్ల వెనుక భాగంలో ఉన్న కండరాలకు మంచి వ్యాయామం అవుతుంది. ఇది కాళ్లపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ముందుకు నడవడం కంటే వెనక్కి నడవడమే మీ కాళ్లకు మంచి ప్రయోజనకరమైన వ్యాయామం అవుతుంది.

బరువు తగ్గిస్తుంది: 

రివర్స్ వాకింగ్ బరువు తగ్గాలనుకుంటున్న వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ముందుకు నడవడం కంటే వెనక్కి నడిస్తేనే ఎక్కువ బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

ఈ వాకింగ్ మీ శరీరంలో వెనుక భాగంలో పేరుకుపోయే కొవ్వును  బాగా తగ్గిస్తుంది.మీరు గనుక ప్రతిరోజూ 15 నిమిషాల పాటు వెనక్కి నడిస్తే చాలా తొందరగా బరువు తగ్గుతారు. 

మానసిక ఆరోగ్యంలో మెరుగుదల:

మీరు వెనక్కి నడుస్తున్నప్పుడు మీ మనసు దృష్టిని ఎక్కువ పెడుతుంది. అంటే ఇది మీ మెదడుకు మంచి వ్యాయామం కూడా అవుతుంది. అందుకే మీరు ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు వెనక్కి నడిస్తే మీ మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గిపోతాయి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జీవనశైలి
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image2
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Recommended image3
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved