డెలివరీ తరువాత వచ్చే పొట్ట, బరువును తగ్గించే సూపర్ హెల్తీ టిప్స్!
గర్భధారణ సమయంలో కడుపులోని బిడ్డ ఎదుగుదల కారణంగా పొట్టపై భాగం చర్మం బాగా సాగుతుంది. మరీ డెలివరీ (Delivery) అయిన తరువాత పొట్ట సాధారణ స్థితికి చేరుతుంది.

కొందరి మహిళల్లో మాత్రం పొట్టపై భాగం చర్మం వదులుగా సాగినట్టు ఉండి పైకి ఎత్తుగా, అసౌకర్యంగా (Uncomfortable) మరల గర్భం ధరించినట్టు కనిపిస్తుంది. ఇందుకోసం ఎటువంటి డైట్ చేయకుండా కొన్ని చిట్కాలను పాటిస్తే సులభంగా పొట్ట, బరువును తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చాలా మంది మహిళలు డెలివరీ తరువాత పొట్ట, బరువును తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఇందుకోసం డైటింగ్ (Dieting) చేస్తారు. అయితే ఇలా చేయడంతో బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కనుక ఎటువంటి డైటింగ్ లేకుండా సహజసిద్ధమైన పద్ధతిలో పొట్ట, బరువును (Weight) తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అపుడే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు.
గోరువెచ్చని నీరు, నిమ్మరసం, తేనె: డెలివరీ తరువాత వచ్చే పొట్ట, బరువును తగ్గించుకునేందుకు గోరువెచ్చని నీరు చక్కటి పరిష్కారం. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో (Lukewarm water) ఒక స్పూన్ నిమ్మరసం (Lemon juice), ఒక స్పూన్ తేనె (Honey) కలుపుకొని తాగితే బరువు సులభంగా తగ్గుతారు. ఈ మిశ్రమం పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి పొట్టను సాధారణ స్థితికి వస్తుంది.
యాలకులు, సోంపు: ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు, నాలుగు యాలకులు (Cardamom), ఒక స్పూన్ సోంపు (Anise) వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే శరీరంలో జీవక్రియల రేటు పెరిగి పొట్ట భాగంలో పేరుకుపోయిన అధిక కొవ్వు సులభంగా కరిగిపోతుంది. అలాగే ఈ మిశ్రమం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
నువ్వుల నూనె: నువ్వుల నూనెతో (Sesame oil) పొట్ట భాగంపై పది నిమిషాలపాటు బాగా మర్దన చేసుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో కాపురం పెట్టుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పొట్ట భాగంలోని కండరాలు (Muscles) బిగుతుగా మారతాయి. దీంతో పొట్ట సులభంగా తగ్గుతుంది. కనుక డెలివరీ తరువాత పొట్ట వదులు సమస్యతో బాధపడేవారు ఈ చిట్కాను అనుసరించడం మంచిది.
గ్రీన్ టీ: గ్రీన్ టీ (Green tea) లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీర బరువును తగ్గించడానికి సహాయపడతాయి. కనుక డెలివరీ తరువాత పొట్ట బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం గ్రీన్ టీని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ టీని తీసుకుంటే మరెన్నో ఆరోగ్యప్రయోజనాలు (Health benefits) మీ సొంతం అవుతాయి. కనుక క్రమం తప్పకుండా గ్రీన్ టీని తాగండి.
చనుపాలు ఇవ్వడం: కొందరు మహిళలు బిడ్డకు చనుపాలు అందించడంతో వారి అందం దెబ్బతింటుందని ఆలోచిస్తున్నారు. నిజానికి తల్లి బిడ్డకు చనుపాలు (Breast milk) ఇవ్వడం బిడ్డ ఆరోగ్యానికి మాత్రమే కాదు ఆమె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. చనుపాలు ఇవ్వడం, చిన్నపాటి వ్యాయామాలు (Exercises) చేయడంతో ఉదర భాగం కొవ్వును, శరీరం కొవ్వును కోల్పోతారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ వంటి ఇతర అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇంకా మరెన్నో ఆరోగ్యప్రయోజనాలు మీ సొంతమవుతాయి.