కంటి కింద ఏర్పడ్డ నల్లటి వలయాలను పోగొట్టే సూపర్ టిప్స్..!
కొందరిలో ముఖం అందంగా కనిపించిన కంటి కింద ఏర్పడ్డ నల్లటి వలయాల (Black circles) కారణంగా వారి సౌందర్యం తగ్గినట్టు అనిపిస్తుంది.

ముఖ సౌందర్యంతో పాటు కంటి సౌందర్యానికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇందుకోసం ఇంట్లోనే కొన్ని సహజ సిద్ధమైన టిప్స్ (Tips) ను అనుసరిస్తే నల్లటి వలయాలు తగ్గి ముఖ సౌందర్యం మరింత రెట్టింపవుతుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి ముఖ్య కారణం ఒత్తిడి, అలసట, నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యత, జీవనశైలిలోని కొన్ని మార్పులు. అంతేకాకుండా కంటి సౌందర్యం కోసం ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty Products) లోని కెమికల్స్ (Chemicals). ఇలా పలు రకాల కారణాలతో కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.
తక్కువ ఖర్చుతో ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే నల్లటి వలయాలను తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ ను అనుసరిస్తే మంచి ఫలితం (Good result) ఉంటుంది. వీటి ఉపయోగంతో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) లేకుండా నల్లటి వలయాలు తగ్గుతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
కీరదోసకాయ: నల్లటి వలయాలను తగ్గించడానికి కీరదోస ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కీరదోసను (Cucumber) గుండ్రంగా ముక్కలుగా కట్ చేసుకుని కాసేపు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. చల్లారాక బయటకు తీసి ఇరవై నిమిషాల పాటు కళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేస్తే కంటికి అలసట (Fatigue) తగ్గి విశ్రాంతి కలుగుతుంది. దీంతో నల్లటి వలయాలు కూడా తగ్గుతాయి.
చల్లటి పాలు: చల్లటి పాలను (Cold milk) దూది పింజల సహాయంతో నల్లటి వలయాలపై అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నల్లటి వలయాలు తగ్గి కంటి సౌందర్యం (Eye beauty) పెరుగుతుంది. దీంతో ముఖ సౌందర్యం కూడా మరింత రెట్టింపవుతుంది.
అలోవెరా: అలోవెరాలో (Aloevera) యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి నల్లటి వలయాలను తగ్గించడానికి సహాయపడుతాయి. కనుక అలోవెరా జెల్ ను కంటి కింద ఏర్పడ్డ నల్లని వలయాలపై అప్లై చేసుకుని పావుగంట తరువాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
బంగాళదుంప జ్యూస్: కంటి కింద ఏర్పడ్డ నల్లటి వలయాలపై బంగాళదుంప జ్యూస్ (Potato juice) ను అప్లై చేసుకోవాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం కంటికింద చర్మాన్ని శుభ్రపరుస్తుంది (Cleanses the skin). దీంతో నల్లటి వలయాలు కూడ క్రమంగా తగ్గిపోయి తిరిగిరావు.
రోజ్ వాటర్: రోజ్ వాటర్ (Rosewater) నల్లటి వలయాలను తగ్గించే మంచి బ్యూటీ ప్రొడక్ట్ గా సహాయపడుతుంది. కనుక కళ్లపై ఏర్పడ్డ నల్లటి వలయాలపై దూది పింజల సహాయంతో రోజ్ వాటర్ ను అప్లై చేసుకొని పావుగంట తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం (Good result) ఉంటుంది.