సమ్మర్ స్పెషల్.. మామిడి గుజ్జుతో ఫేస్ ప్యాక్.. నిగనిగలాడే అందం మీ సొంతం!
కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ (King of Fruits) గా పిలువబడే మామిడి (Mango) వేసవికాలంలో విరివిగా లభిస్తాయి. ఈ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి.

ఇవి ఆరోగ్యానికే కాదండోయ్ అందమైన ముఖ సౌందర్యానికి కూడా మంచి ఫలితాలను అందిస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మామిడి పండ్లును ఏవిధంగా ఉపయోగిస్తే అందమైన ముఖ సౌందర్యం మీ సొంతమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మామిడి పండ్లలో బీటా-కెరోటిన్ (Beta-carotene), విటమిన్ ఎ లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ గ్రంధులను లోపలి నుంచి శుభ్రపరిచి మృతకణాలను తొలగిస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుతాయి. దీంతో మొటిమలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలు వంటి సమస్యలు తగ్గి ముఖానికి మంచి నిగారింపు అందుతుంది.
మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి: ఒక కప్పులో కొద్దిగా మామిడి గుజ్జు (Mango pulp), రెండు టీ స్పూన్ ల పెరుగు (Yogurt), రెండు టేబుల్ టీ స్పూన్ ల తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై ఏర్పడ్డ మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
మృతకణాలు తొలగిపోతాయి: ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ మామిడి గుజ్జు (Mango pulp), ఒక టీ స్పూన్ తేనె (Honey), ఒక టీ స్పూన్ బియ్యప్పిండి (Rice flour), ఒక టేబుల్ స్పూన్ పాలు (Milk) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా కనీసం వారానికి రెండు మూడు సార్లు చేస్తే చర్మకణాలలో పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.
చర్మం ముడతలు తగ్గిపోతాయి: ఒక కప్పులో మామిడి గుజ్జు (Mango pulp), రెండు టేబుల్ స్పూన్ అవొకాడో గుజ్జు (Avocado pulp), ఒక టేబుల్ స్పూన్ తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి. ఇలా చేస్తే మామిడిలో ఉండే గుణాలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మం ముడతలు పడకుండా చేస్తుంది.
చర్మం నిగారింపు పెరుగుతుంది: ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ మామిడి గుజ్జు (Mango pulp), రెండు టీ స్పూన్ ల గోధుమపిండి (Wheat flour), ఒక టీ స్పూన్ తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మ గ్రంథులలో పేరుకుపోయిన మలినాలు, మృతకణాలు తొలగిపోయి చర్మానికి సహజసిద్ధమైన నిగారింపు లభిస్తుంది.
బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి: ఒక కప్పులో ఒక స్పూన్ మామిడి గుజ్జు (Mango pulp), సగం స్పూన్ పాలు (Milk), ఒక టీ స్పూన్ తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై ఏర్పడిన బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. అలాగే కాంతివంతమైన చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది.