Summer Care: ఎండకు కమిలి నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా మార్చే బ్యూటీ టిప్స్..!
Summer Care: వేసవి కాలంలో అధిక ఎండ కారణంగా చర్మం కమిలిపోయి నల్లగా మారడంతో పాటు అనేక చర్మ సమస్యలు ఎదురవుతాయి.

ఈ సమస్యలను తగ్గించుకోవడానికి బయట మార్కెట్ లో అందుబాటులో ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty Products) ను ఉపయోగించడం కంటే ఇంటిలోనే సహజసిద్ధమైన పద్ధతిలో తయారు చేసుకొనే రెమిడీస్ (Remedies) ని ఉపయోగిస్తే మంచి ఫలితాలను పొందవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. వాటి తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇలా ఇంట్లోనే తయారు చేసుకునే రెమిడీస్ ను చర్మ సౌందర్యం (Skin beauty) కోసం ఉపయోగిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు (No side effects). దీంతో చర్మం తన సహజసిద్ధమైన సౌందర్యాన్ని కోల్పోదు. వీటి తయారీ విధానం కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం కూడా ఉండదు. ఈ రెమెడీస్ నల్లగా కమిలిపోయిన చర్మాన్ని తెల్లగా మార్చడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
ఉల్లిపాయ రసం, యాపిల్ సైడర్ వెనిగర్: ఒక కప్పు తీసుకొని అందులో కొద్దిగా ఉల్లిపాయ రసం (Onion juice), కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ (Apple cider vinegar) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇది స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారించి చర్మాన్ని తెల్లగా మారుతుంది.
పచ్చి బొప్పాయి గుజ్జు, పచ్చి పాలు: ఒక కప్పులో కొద్దిగా పచ్చి బొప్పాయి గుజ్జు (Papaya pulp), పచ్చి పాలు (Milk) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా మసాజ్ చేసుకొని పదినిమిషాల తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం చర్మాన్ని శుభ్రపరిచి మంచి నిగారింపును అందిస్తుంది.
నిమ్మరసం, తేనె: ఒక కప్పులో కొద్దిగా నిమ్మరసం (Lemon juice), కొద్దిగా తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమంలో ఉండే వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మంచి నిగారింపును అందిస్తాయి.
బంగాళదుంప రసం, నిమ్మరసం: ఒక కప్పులో రెండు స్పూన్ ల బంగాళాదుంప రసం (Potato juice), కొద్దిగా నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకుంటే చర్మానికి మంచి ఫలితాలు అందుతాయి.
అలోవెరా జెల్: అలోవెరా జెల్ (Aloe vera gel) ను ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసుకుని మరుసటి రోజు ఉదయం ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మకణాలలో పేరుకుపోయిన మృత కణాలు (Dead cells) తొలగిపోతాయి. దీంతో చర్మం శుభ్రపడి చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యలు తగ్గి చర్మం తెల్లగా మారుతుంది.