Health Tips: భరించలేని మైగ్రేన్ తో బాధపడుతున్నారా.. అయితే ఒకసారి ఇలా ప్రయత్నించండి?
Health Tips: మామూలు తలనొప్పి వస్తేనే భరించలేము అలాంటిది మైగ్రేన్ అంటే అది మరింత బాధాకరమైన నొప్పి. ఈ చిట్కాలతో పూర్తిగా నయం చేయలేం కానీ కాస్త ఉపశమనం లభిస్తుంది ప్రయత్నించి చూడండి.

సాధారణంగా మైగ్రేన్ తలనొప్పి వస్తే వికారం వాంతులు వెలుతురుని చూడలేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి ఆ బాధ భరించడం చాలా కష్టం. అసలు మైగ్రేన్ కి మూల కారణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది ఈ నొప్పి ఎందుకు వస్తుంది అనేదానికి పరిశోధకుల దగ్గర సరైన సమాధానం లేదు.
తలలో రక్తనాళాల మీద ఒత్తిడి పెంచి భరించలేని తలనొప్పి తీసుకువస్తుంది. మైగ్రేన్ తో బాధపడేవారు తరచూ తట్టుకోలేనంత తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. ఈ నొప్పి మామూలుగా ఒకవైపే భయంకరంగా వస్తుంది. ఈ నొప్పి పురుషుల్లో కన్నా స్త్రీలలోనే మూడు రెట్లు అధికంగా ఉంటుంది.
దీర్ఘకాలం పాటు ఉండే ఈ తలనొప్పిని తగ్గించడం కోసం రకరకాల మాత్రలు వాడటం తో పాటు ఎవరూ ఏ చిట్కా చెప్పినా పాటించేస్తూ ఉంటాం. ఈ చిట్కాలు వల్ల నొప్పిని పూర్తిగా నివారించలేము కానీ కాస్త ఉపశమనం కలుగుతుంది.
అలాంటి వంటింటి చిట్కాలు కొన్ని చూద్దాం. అల్లం రసం, నిమ్మరసం రెండింటి సమపాలలో కలిపి రోజు రెండు పూటలా కొద్ది రోజులు తాగటం వలన మైగ్రేన్ తరచుగా రాకుండా నివారించవచ్చు. తలనొప్పి వచ్చినప్పుడు పుదీనా లేదా అల్లం రసాన్ని నుదుటిపై మర్దన చేస్తూ రాసుకోవాలి.
మైగ్రేన్ తో బాధపడేవారు ఎక్కువగా నడుస్తూ ఉండాలి కనీసం రోజుకి రెండు కిలోమీటర్ల అయినా నడుస్తూ ఉంటే మంచిది. కపు వేడి నీటిలో బ్లాక్ టీ ని కలుపుకొని అందులో పుదీనా ఆకులు వేసుకుని తరచూ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే తలనొప్పి వచ్చిన సమయంలో మెడ తల పైన ఐస్ ప్యాక్ ని ఉంచుకున్న ఉపశమనం కలుగుతుంది. కాబట్టి చిన్న చిన్న చిట్కాలతో నొప్పిని తగ్గించే ప్రయత్నం చేయండి. బాధ భరించలేనిదిగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించటమే మంచిది.