Health Tips: సైనస్ ను లైట్ తీసుకుంటున్నారా.. అశ్రద్ధ చేస్తే అంతే సంగతి?
Health Tips: " సైనస్" ఇది సీజన్తో సంబంధం లేకుండా వచ్చే సమస్య. అందరూఈ సమస్యని కామన్ గా తీసుకుంటారు కానీ అశ్రద్ధ చేస్తే బ్రెయిన్ ఫీవర్ కి దారితీస్తుందంట.. అదేంటో తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

ఈ రోజుల్లో సైనస్ సాధారణ సమస్యగా మారిపోయింది. సైనస్ వల్ల కలిగే ఇబ్బంది అంతా కాదు. దీనివల్ల వచ్చే ఇబ్బంది భరించిన వారికి మాత్రమేతెలుస్తుంది. ఇది వర్షాకాలంలో మాత్రమే ఇబ్బంది పెడుతుంది అని చాలామంది అనుకుంటారు కానీ కాలాలతో సంబంధం లేకుండా ఇబ్బంది పెట్టే సమస్య సైనస్.
చాలామంది ఈ సైనస్ సమస్యని సీరియస్ గా తీసుకోరు.. కానీ ఒక దశ దాటితే సైనస్ బ్రెయిన్ ఫీవర్ కి దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అసలు ఈ సైనస్ అంటే ఏమిటి? ముఖంలో కళ్ళ దగ్గర ముక్కు పక్క భాగంలో ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండిన ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఇందులో మెత్తని పొర ఉంటుంది.
ఇది మ్యూకస్ మెమరీయన్ అనే పలుచని ద్రవాన్ని తయారు చేస్తుంది. ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలో పీల్చుకున్న గాలికి సరి అయిన ఉష్ణోగ్రత తేమని కల్పిస్తుంది ఈ ద్రవపదార్థం ఈ భాగం ఇన్ఫెక్షన్లకి గురైనప్పుడు దాన్నే సైనసైటిస్ అంటారు.
ఈ సైనస్ ని సాధారణ స్థితిలో ఉన్నప్పుడు చిన్నచిన్న చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు అవేంటో చూద్దాం. శరీరంలోకి ఎక్కించే సెలైన్ ను పిలిస్తే ముక్కు రంధ్రాలు క్లియర్ అవుతాయని ఎన్హెచ్ఎస్ నివేదిక వెల్లడించింది. అలాగే నీటిలో కొంచెం ఉప్పు బేకింగ్ సోడా వేసి దానిని వాసన చూసినా ముక్కు రంధ్రాలు శుభ్రపడతాయి.
అలాగే ఆవిరి పట్టటం కూడా సైనస్ కి బ్రహ్మాస్త్రం లాంటిది. సైనస్ ని తొలగించాలి అనుకుంటే ఎక్కువ మీరు త్రాగండి. గోరువెచ్చని నీరు తాగటం వల్ల సైనస్ నొప్పి తగ్గుతుంది. వీలైనంత మటుకు ఫ్రిజ్లో ఆహారాన్ని తినకుండా అవాయిడ్ చేయండి వేడి వేడి ఆహార పదార్థాలను తినడం వల్ల సైనస్ మన దగ్గరికి రావడానికి ఆలోచిస్తుంది.
అలాగే గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల పేపర్ వేసి దానిని ఆవిరి పీల్చినా కాస్త ఉపశమనం లభిస్తుంది. ఇదంతా సైనస్ అదుపులో ఉన్నప్పుడు మాత్రమే పాటించవలసిన చిట్కాలు. సమస్య మన చేయి దాటినప్పుడు డాక్టర్ని సంప్రదించడం మంచిది.