స్పెషల్ స్వీట్స్.. మిల్క్ పౌడర్ బర్ఫీ, చాక్లెట్ పేడా.. ఎలా చెయ్యాలంటే?
క్రిస్మస్ రోజున ఇంటికి వచ్చిన అతిథులకు (Guests) సర్వ్ చేయడానికి ఏ స్వీట్ తయారు చేస్తే బాగుంటుందో అని ఆలోచిస్తున్నారా! అయితే ఎప్పుడు చేసుకునే స్వీట్స్ కు బదులుగా కాస్త వెరైటీగా మిల్క్ పౌడర్ బర్ఫీ, చాక్లెట్ పేడాను ఈ సారి ట్రై చేయండి. ఈ స్వీట్ ను తక్కువ పదార్థాలతో (With less ingredients), తక్కువ సమయంలో, సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా వీటి తయారీ విధానం గురించి తెలుసుకుందాం.

మిల్క్ పౌడర్ బర్ఫీ (Milk Powder Barfi): కావలసిన పదార్థాలు: రెండున్నర కప్పుల పాల పొడి (Milk powder), ముప్పావు కప్పు పాలు (Milk), సగం కప్పు చక్కెర (Sugar), పావు స్పూన్ యాలకుల పొడి (Cardamom powder), రెండు టేబుల్ స్పూన్ ల బాదం (Almond ) పలుకులు, రెండు టేబుల్ స్పూన్ ల పిస్తా (Pista) పలుకులు, పావు కప్పు నెయ్యి (Ghee).
తయారీ విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తరువాత అందులో పాలు పోసి తక్కువ మంట (Low flame) మీద మరిగించాలి. పాలు బాగా మరుగుతున్న సమయంలో పాల పొడి, చక్కెర వేసి బాగా కలుపుకోవాలి (Mix well). పాలపొడి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉంటే మిశ్రమం అడుగంటకుండా చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో పరిచి పైన బాదం, పిస్తా పలుకులతో గార్నిష్ (Garnish) చేసుకోవాలి. అంతే ఎంతో తీయనైన మిల్క్ పౌడర్ బర్ఫీ రెడీ (Ready).
చాక్లెట్ పేడా (Chocolate peda): కావలసిన పదార్థాలు: ఒక కప్పు పాల పొడి (Milk powder), ఒక కప్పు కండెన్స్డ్ మిల్క్ (Condensed milk), ఒక టేబుల్ స్పూన్ చాక్లెట్ పొడి (Chocolate powder), రెండు టేబుల్ స్పూన్ ల వెన్న (Butter), ఒక స్పూన్ నెయ్యి (Ghee), డ్రైఫ్రూట్స్ (Dry Fruits) పలుకులు కొన్ని.
తయారీ విధానం: స్టౌ మీద కడాయి పెట్టి వెన్న (Butter) వేసి వేడి చేసుకోవాలి. వెన్న కరిగిన తర్వాత అందులో పాల పొడి, కండెన్స్డ్ మిల్క్, చాక్లెట్ పొడి (Chocolate powder) వేసి తక్కువ మంట మీద ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ మిశ్రమం అడుగంటకుండా చూసుకోవాలి.
మిశ్రమమంతా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిశ్రమం చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని పేడల్లా చేసుకుని డ్రైఫ్రూట్స్ (Dry Fruits) తో గార్నిష్ చేసుకోవాలి. అంతే చాక్లెట్ పేడా రెడీ (Ready).
ఈ స్వీట్స్ ను ఈ క్రిస్మస్ పండుగ (Christmas) రోజున మీరు తప్పక ట్రై చేయండి. ఈ స్వీట్ ఐటమ్ మీ బంధు మిత్రులకు (Relatives) తప్పక నచ్చుతుంది.