MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • అందంగా కనిపించాలని రోజూ షేప్ వేర్ ను వేసుకుంటున్నారా? అయితే మీకు ఈ సమస్యలు రావడం పక్కా..!

అందంగా కనిపించాలని రోజూ షేప్ వేర్ ను వేసుకుంటున్నారా? అయితే మీకు ఈ సమస్యలు రావడం పక్కా..!

షేప్ వేర్ వేసుకోవడం వల్ల పొట్ట కనిపించదు. అలాగే అందంగా, చూడచక్కగా కనిపిస్తారు. అందుకే ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలే కాదు సాధారణ జనాలు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. కానీ వీటిని రోజూ ఉపయోగించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 14 2023, 12:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుత కాలంలో షేప్ ను వేర్ ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇవి అన్ని రకాల సైజులు, ఆకారాల మహిళలకు కూడా సరిపోతాయి కాబట్టి. స్లిమ్మింగ్ బాడీ సూట్ల నుంచి టమ్మీ కంట్రోల్ ప్యాంటీల వరకు మనలో చాలా మంది మన రూపాన్ని మెరుగుపర్చుకోవడానికి షేప్ వేర్ లను ఉపయోగిస్తుంటాం. వీటిని ధరించడం వల్ల పొట్ట అసలే కనిపించదు. ఎంతో అందంగా కనిపిస్తారు కూడా. కానీ చాలా మంది ఆడవాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. వీటిని ప్రతిరోజూ వేసుకోవడం వల్ల ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అవును ప్రతిరోజూ షేప్ వేర్ లను ఉపయోగించడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నుంచి ఈస్ట్ ఇన్ఫెక్షన్ వరకు ఎన్నో సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

26
Urinary

Urinary

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్

షేప్ వేర్ ను వేసుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మన మూత్రాశయంపై ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే మూత్రాశయంలో బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. ఇది యూటీఐ కి దారితీస్తుంది. అంతేకాదు కొన్ని షేప్ వేర్ ల దుస్తుల క్లాత్ మూత్రాశయాన్ని చికాకుపెడుతుంది. ఇది యూటీఐ ప్రమాదాన్ని మరింత పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట లేదా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. ఎందుకంటే ఇది సంక్రమణకు సంకేతం కావొచ్చు.
 

36
yeast infections

yeast infections

ఈస్ట్ ఇన్ఫెక్షన్లు

షేప్ వేర్ వంటి టైట్ గా ఉండే దుస్తులను ధరించడం వల్ల యోని ప్రాంతంలో తేమ, వేడి పెరుగుతుంది. ఇది ఈస్ట్ వృద్ధి చెందేలా చేస్తుంది. టైట్ క్లాత్ బిగుతు యోని ప్రాంతంలో చాఫింగ్, చికాకు, చర్మం దురద వంటి సమస్యలకు కూడా కారణమవుతుంది. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కూడా దారితీస్తుంది. యోని చుట్టూ దురద, మంట లేదా వాపును వంటి సమస్యలను గమనించినట్టైతే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. ఎందుకంటే ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు సంకేతం కావొచ్చు.

46

స్కిన్ ఇన్ఫెక్షన్స్

చాలా టైట్ గా ఉండే షేప్ వేర్ మీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. ఇది చర్మ ఘర్షణకు కారణమవుతుంది. దీంతో చర్మపు చికాకు, సంక్రమణ వంటి సమస్యలు వస్తాయి. అలాగే  షేప్ వేర్ ను ధరించే ముందు మీ చర్మంపై ఏదైనా కోతలు లేదా స్క్రాప్లు ఉంటే.. షేప్ వేర్ ను ధరించకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది ఈ గాయలను మరింత పెద్దది చేస్తుంది. అలాగే సంక్రమణకు దారితీస్తుంది. 
 

56

వెన్నునొప్పి

రెగ్యులర్ గా షేప్ వేర్ ను వేసుకోవడం వల్ల మీ ఉదర, వెనుక కండరాలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది వెన్నునొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా చాలా టైట్ గా ఉంటే షేప్ వేర్ దుస్తులను ఉపయోగించడం వల్ల మీ కండరాలను లాగుతాయి. వెన్నునొప్పికి మరింత దోహదం చేసే కండరాల నొప్పులకు కారణమవుతాయి. షేప్ వేర్ ను ధరించడం వల్ల మీకు వెన్ను నొప్పి లేదా అసౌకర్యం వంటి సమస్యలు వస్తే హాస్పటల్ కు వెళ్లండి. ఎందుకంటే ఇది ప్రమాదకరమైన సంకేతం కావొచ్చు. 

66

జీర్ణ సమస్యలు

షేప్ వేర్ వంటి టైట్ గా ఉండే దుస్తులు మీ అంతర్గత అవయవాలను దగ్గరగా చేస్తాయి. అలాగే మీ జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయకుండా ఆటంకం కలిగిస్తాయి. ఇది గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి, విరేచనాలు వంటి వివిధ రకాల జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ఎక్కువసేపు టైట్ గా ఉండే షేప్ వేర్ ను ధరిస్తే అది మీ కడుపు, ప్రేగులను కుదిస్తుంది. దీంతో ఈ ప్రాంతాల్లో రక్త ప్రవాహం తగ్గుతుంది. ఇది మరిన్ని జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.  షేప్ వేర్ ను ధరించేటప్పుడు మీరు ఏదైనా జీర్ణ సమస్యలను ఎదుర్కొంటుంటే.. వదులుగా ఉండే దుస్తులు ధరించడం లేదా కడుపు ఆమ్ల ఉత్పత్తిని తగ్గించడానికి మందులు తీసుకోవడం వంటివి చేయండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Watermelon: పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టుకొని తినొచ్చా? తింటే ఏమవుతుంది?
Recommended image2
Sabja Water: ఎండాకాలంలో సబ్జా వాటర్ తాగితే బరువు తగ్గుతారా?
Recommended image3
Menstrual Health: పీరియడ్స్‌లో మలబద్ధకమా? ఈ టిప్స్ పాటిస్తే సమస్య దూరం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved