MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • రాత్రిళ్లు ఫోన్ ను తెగ వాడేస్తున్నారా? రోగాలకు బలైపోతారు జాగ్రత్త..!

రాత్రిళ్లు ఫోన్ ను తెగ వాడేస్తున్నారా? రోగాలకు బలైపోతారు జాగ్రత్త..!

మొబైల్ కూడా మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఆఫీసు పని నుంచి స్కూల్, కాలేజీ చదువుల వరకు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ మొబైల్ ను ఉపయోగిస్తున్నారు. కానీ అవసరానికి మించి ఫోన్ ను వాడటం వల్ల మీ ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది. ముఖ్యంగా రాత్రిళ్లు చాలా సేపటివరకు ఉపయోగించేవారికి ఎన్నో డేంజర్ రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Shivaleela Rajamoni | Updated : Nov 05 2023, 07:15 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఫోన్ లేకుండా క్షణ కాలం కూడా ఉండలేని వారు చాలా మందే ఉన్నారు. ఎంటర్ టైన్మెంట్ కోసం దీన్ని విచ్చల విడిగా ఉపయోగిస్తారు. ఉదయం కళ్లు తెరిచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఈ మొబైల్ జనాల చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ ను ఎక్కువగా చూస్తుంటారు. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ అంటే ఎన్నింటినో స్క్రోల్ చేస్తుంటారు. 
 

26
Asianet Image

ఈ ఫోన్ వాడుతుంటే సమయం కూడా తెలియదు. ఎన్ని గంటలు గడిచిపోతాయో కూడా తెలియదు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ అలవాటు మీ మానసిక ఆరోగ్యాన్నే కాదు మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతిస్తుంది. అసలు ఫోన్ వాడకం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 

36
Asianet Image

ఒకటి ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మీ కళ్లను దెబ్బతీస్తుంది. 
అలాగే మీ నిద్ర దెబ్బతింటుంది. రాత్రిళ్లు అస్సలు నిద్రపట్టుదు. దీంతో మీ డే అంతా గజిబిజిగా, ఒత్తిడిగా మారుతుంది.
ఒకదాని తర్వాత ఒకటి స్క్రోల్ చేస్తూ కాసేపు మొబైల్ పనిచేయకపతే మీరు పడే కంగారు అంతా ఇంతా కాదు. దీనితో మీలో డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. 
గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మీ చేతులు, భుజం కండరాలపై చెడు ప్రభావం పడుతుంది. 
 

46
Asianet Image

అతి వాడకాన్ని ఎలా తగ్గించాలి?

మొబైల్ ఫోన్ ను యూజ్ చేయడానికి ఒక సమయాన్ని సెస్ చేసుకోండి. అంటే రాత్రి పది గంటల తర్వాత నెట్ ను ఆఫ్ చేయాలనే రూల్ పెట్టుకోండి. దీనివల్ల మీకు ఒకటి లేదా రెండు వారాలు కష్టంగా రోజులు గడుస్తాయి. మీ మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు. చేతులు ఖాళీగా కూడా అనిపిస్తాయి. కానీ ఇది అలవాటైన తర్వాత మీరు ఎంతో ప్రశాంతంగా, తొందరగా నిద్రపోతారు. దీంతో మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.

 

56
Asianet Image

నోటిఫికేషన్ ఆఫ్ చేయండి

నోటిఫికేషన్ల వల్లే చాలా మంది ఫోన్ ను అతిగా వాడుతారు. మొబైల్ లో మెసేజ్ టోన్ మోగగానే ఏమోచ్చందని వెంటనే చెక్ చేస్తారు. దాన్ని చూడాలనే ఇష్టం మీకు లేకపోయినా మిమ్మల్ని మీరు ఆపుకోలేరు. అందుకే నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. 

66
Asianet Image

అనవసరమైన సోషల్ మీడియా యాప్స్ ను డిలీట్ చేయండి. అలాగే మీరు మొబైల్ లో స్క్రోల్ చేసేటప్పుడు స్క్రీన్ బ్రైట్ నెస్ ను పూర్తిగా తగ్గించండి. దీంతో మీ కళ్లపై ఎక్కువ ప్రభావం పడదు. అలాగే పడుకునే ముందు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి. 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories