MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • చలికాలంలో బాదం పప్పులను తినకూడదా?

చలికాలంలో బాదం పప్పులను తినకూడదా?

కాలాలతో పాటుగా మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన శరీరాన్ని వేడిగా ఉంచే పదార్థాలను తినాలి. ఆరోగ్యకరమైన ఆహారాల్లో బాదం ఒకటి. ఇవి పోషకాల భాండాగారం. కానీ వీటిని చలికాలంలో ఎక్కువగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 16 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పోషకాలు పుష్కలంగా ఉండే బాదం పప్పులను తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే వీటిని ఎన్నో విధాలుగా తింటుంటారు. ఎన్నో ఆహారాల్లో ఉపయోగిస్తుంటారు. బాదంతో తయారుచేసిన ఆహారాలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే బాదం పప్పులను గార్నిషింగ్ గా కూడా వాడుతుంటారు. నిజానికి బాదం పప్పులు పోషకాలకు మంచి వనరు. వీటిలో విటమిన్  ఇ, ఒమేగా  3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ కె, ప్రోటీన్, ఫైబర్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే వీటిని రెగ్యులర్ గా తింటుంటారు. కానీ వీటిని చలికాలంలో మరి ఎక్కువగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి తెలుసా? అవేంటంటే? 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు

రెగ్యులర్ గా బాదం పప్పులను ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ఎందుకంటే బాదంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే అవసరమైన దానికంటే ఫైబర్ ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. 
 

36

బరువు పెరగడం

అవును బాదం పప్పులు మరీ ఎక్కువగా తింటే కూడా మీరు బరువు పెరుగుతారు. నిజానికి ఈ పప్పుల్లో కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. బాదంలో మోనోశాచురేటెడ్ కొవ్వు కూడా ఉంటుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. అందుకే వీటిని రెగ్యులర్ గా కొద్దిమొత్తంలోనే తినాలి. 
 

46

అలెర్జీ

అవసరానికి మించి బాదం పప్పులను తింటే కొంతమంది చర్మంపై దద్దుర్లు, వాపు, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీటిని తక్కువ పరిమాణంలోనే తినండి. అనాఫిలాక్సిస్ వంటి అలెర్జీలతో బాధపడేవారు బాదంను తినకపోవడమే మంచిది. 
 

56

మూత్రపిండాల్లో రాళ్లు

మీకు మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే బాదం పప్పులను ఎక్కువగా తినడం మానుకోండి. వాస్తవానికి ఈ పప్పుల్లో ఆక్సలేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే కిడ్నీ స్టోన్స్ మరింత పెరుగుతాయి. కాబట్టి వీళ్లు తినకూడదు.
 

66

ఎక్కువ మొత్తంలో విటమిన్-ఇ

బాదం పప్పులో విటమిన్  ఇ మెండుగా ఉంటుంది. ఇది మన జుట్టు పెరిగేందుకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ బాదం పప్పులను ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీరంలో విటమిన్ -ఇ ఎక్కువగా ఉంటే రక్తస్రావం వంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad: మెంట‌ల్ హెల్త్‌ బాగుంటేనే ఆరోగ్యంగా ఉన్న‌ట్లు.. అవి కూడా అనారోగ్య స‌మ‌స్య‌లే
Recommended image2
Fertility Crisis: ప్రమాదంలో మానవ జాతి? భవిష్యత్తులో పిల్లలు పుట్టడం కష్టమే.. ఏం జరుగుతోంది?
Recommended image3
AC : ఎండలోంచి నేరుగా ఏసీ రూమ్‌ లోకి వెళ్తున్నారా..? ఆ చల్లదనం ఎంత డేంజరో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved