లెమన్ టీని ఎక్కువగా తాగకండి.. లేదంటే?
లెమన్ టీని ఎక్కువగా తీసుకోకూడదు లేదా క్రమం తప్పకుండా తాగకూడదు అని చాలా మంది చెప్తుంటారు. నిజానికి ఇలా చెప్పడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే.. ?

లెమన్ టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అయితే బరువు తగ్గాలనుకునేవారు, పొట్ట తగ్గించుకోవాలనుకునేవారు ఉదయాన్నే లెమన్ టీని తాగుతుంటారు. కానీ దీన్ని మరీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని రోజూ తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
lemon tea
జీర్ణ సమస్యలు
జీర్ణ సమస్యలను వదిలించుకోవడానికి చాలా మంది లెమన్ టీ ని తాగుతుంటారు. నిజానికి లెమన్ టీ జీర్ణ సమస్యలను కలిగిస్తుందనే వాదన ఉంది. నిమ్మకాయల్లో యాసిడ్ కంటెంట్ ఉంటుంది. ఈ టీలో ఉండే టానిన్ అనే పదార్థం ఎసిడిటీ వంటి సమస్యలను కలిగిస్తుంది. ఇందుకే నిమ్మకాయలు కలిపిన టీ ని కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు పెరుగుతాయని చెప్తుంటారు.
నిర్జలీకరణం
నిర్జలీకరణం అంటే శరీరంలోని నీటిని తగ్గించే పరిస్థితి. ఇంతకు ముందు చెప్పినట్టుగా లెమన్ టీ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. కాబట్టి ఇది నిర్జలీకరణానికి కూడా కారణమవుతుందని చెప్తుంటారు.
దంతాల ఆరోగ్యం
లెమన్ టీని క్రమం తప్పకుండా తాగితే దంతాల ఆరోగ్యం దెబ్బతింటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. కొందరి అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి ఆమ్ల పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దంతాల ఎనామెల్ దెబ్బతింటుంది. ఇది చివరికి దంత క్షయానికి కారణమవుతుంది. అలాగే నోటి ఆరోగ్యాన్ని మొత్తం ప్రభావితం చేస్తుంది.
ఎముక ఆరోగ్యం
లెమన్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. లెమన్ టీ ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయని నిపుణులు చెబుతున్నారు.
లెమన్ టీకి దూరంగా ఉండాలా?
లెమన్ టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని విన్నాం. అయితే లెమన్ టీని మితంగా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు రావు. ఏ ఆహారమైనా, పానీయమైనా ఎక్కువగా తీసుకుంటేనే లేని పోని సమస్యలు వస్తాయి. అంతేకాకుండా లెమన్ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఇప్పటికే జీర్ణ సమస్యలు, ఇలాంటి అనారోగ్యాలు ఉన్నవారిపై ప్రభావం చూపుతుందని చెబుతారు. అయితే డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ లేదా వైద్యుడిని సంప్రదించడం మంచిది.