చలికాలంలో వేడి నీళ్లను ఎక్కువగా తాగితే ఏమౌతుందో తెలుసా?
వేడి నీళ్లు మంచివే. కానీ చలికాలంలో వేడి నీళ్లను మరీ ఎక్కువగా తాగితే మాత్రం లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
hot water
చలికాలంలో వాతావరణం పూర్తిగా మారుతుంది. దీంతో దగ్గు, జలుబు, జ్వరం, కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ సమస్యలు రావొద్దని, శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి వేడి నీళ్లను బాగా తాగుతుంటారు. నిజానికి గోరువెచ్చని నీళ్లను తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ వేడి నీళ్లను మరీ ఎక్కువగా తాగితే మాత్రం లాభాలకు బదులుగా నష్టాలను చూడాల్సి వస్తుంది. అందుకే చలికాలంలో వేడి నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
hot water benefits
నిర్జలీకరణం
సాధారణంగా వేడి నీళ్లు తాగితే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అందులోనూ చలికాలంలో జనాలు నీళ్లను తక్కువగా తాగుతుంటారు. కానీ దీనివల్ల శరీరంలో నీళ్లు తక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో మీరు మీరు వేడి నీళ్లను ఎక్కువగా తాగితే డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది.
జీర్ణ సమస్య
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వేడినీళ్లను ఎక్కువగా తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి. వేడినీళ్ల వల్ల పొట్ట ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. దీంతో మీ కడుపులో గ్యాస్, ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. అంతేకాదు మలబద్దకం సమస్య కూడా వస్తుంది. జీర్ణసమస్యలు ఎక్కువగా రావొద్దంటే చలికాలంలో వేడినీళ్లను ఎక్కువగా తాగకూడదు.
గొంతు నొప్పి
చలికాలంలో గొంతునొప్పి ఎక్కువగా వస్తుంటుంది. ఇది సర్వసాధారణం అయినప్పటికీ.. దీనివల్ల ఏది తినడానికి, తాగడానికి అస్సలు రాదు. అయితే చలికాలమని మీరు వేడి నీళ్లను ఎక్కువగా తాగితే గొంతునొప్పి వస్తుంది. అల్సర్ సమస్య వస్తుంది.
మూత్రపిండాల సమస్య
మూత్రపిండాల సమస్య ఉన్నవారు వేడినీళ్లను ఎక్కువగా తాగకూడదు. ఎందుకంటే వేడినీళ్లను ఎక్కువగా తాగితే మూత్రపిండాలపై చెడు ప్రభావం పడుతుంది. అయితే మన మూత్రపిండాలు చల్ల నీళ్లనే ఫిల్టర్ చేస్తాయి. ఒకవేళ మీరు వేడినీళ్లను ఎక్కువగా తాగితే కిడ్నీలు నీళ్లను ఫిల్టర్ చేయలేవు.
నిద్రకు భంగం
రాత్రిపూట వేడి నీళ్లను ఎక్కువగా తాగితే మీరు మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల మీకు రాత్రిళ్లు నిద్రకూడా పట్టదు. అందుకే రాత్రిపూట వేడినీళ్లను ఎక్కువగా తాగకూడదు.
గోరువెచ్చగా త్రాగాలి. చలికాలంలో ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ల కంటే గోరువెచ్చని నీళ్లను తాగడమే మంచిది.