రెస్టారెంట్ స్టైల్ లో చికెన్ లాలి పాప్ ఎలా చెయ్యాలంటే?
చలికాలంలో, వర్షాకాలంలో చల్లని సాయంత్రం వేళ వేడి వేడిగా క్రిస్పీగా మంచి స్నాక్ (Snack) వినాలనిపిస్తుంది. అలాంటప్పుడు రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్ (Chicken Lollipop) లను తయారు చేసుకుంటే సరిపోతుంది. చల్లని సాయంత్రాన్ని ఆస్వాదించవచ్చు. దీని రుచి కూడా బాగుంటుంది. దీని తయారీ విధానం కూడా సులభం. చికెన్ లాలిపాప్ లు తినడానికి జ్యూసీగా, క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి. ఇవి అచ్చం రెస్టారెంట్ స్టైల్ రుచిని కలిగి ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: 6 చికెన్ వింగ్స్ (Chicken wings), ఉల్లిపాయ (Onion) ఒకటి, పచ్చిమిరపకాయలు (Green chilly) రెండు, సగం స్పూన్ అల్లం (Ginger) తరుగు, సగం స్పూన్ వెల్లుల్లి (Garlic) తరుగు, సగం టీ స్పూన్ తెల్ల మిరియాల పొడి (White pepper powder), సగం టీ స్పూన్ నల్లమిరియాల పొడి (Black pepper powder).
రుచికి సరిపడా ఉప్పు (Salt), సగం స్పూన్ నిమ్మరసం (Lemon juice), ఒక టేబుల్ స్పూన్ చైనీస్ చిల్లి పేస్ట్ (Chinese chilly paste), పావు స్పూన్ సోయా సాస్ (Soya sauce), ఢీ ఫ్రైకి సరిపడు నూనె (Oil), రెండు టేబుల్ స్పూన్ ల కార్న్ ఫ్లోర్ (Corn flour), రెండు టేబుల్ స్పూన్ ల మైదా (Maida).
తయారీ విధానం: ముందుగా అరగంట పాటు చికెన్ వింగ్స్ (Chicken wings) ను ఉప్పు నీటిలో (Salt water) నానబెట్టుకోవాలి. ఇలా చికెన్ ను ఉప్పు నీటిలో నానబెట్టుకుంటే చికెన్ జ్యూసీగా మంచి టేస్టీగా ఉంటుంది.
ఇలా నానబెట్టుకున్న చికెన్ (Soaked chicken) ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, నల్ల మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, చైనీస్ చిల్లీస్ పేస్ట్, నిమ్మకాయ రసం, సోయా సాస్ వేసి మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి (Mix well).
తరువాత ఇందులో ఒక స్పూన్ నూనె వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మైదా, కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. అవసరమైతే ఒక టేబుల్ స్పూన్ నీళ్లు (Water) వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు చికెన్ వింగ్స్ ఢీ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ (Oil) వేడెక్కిన తర్వాత చికెన్ లాలిపాప్ ను వెయ్యాలి.
రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకూ తక్కువ మంట (Low flame) మీద చికెన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ ముక్కలను ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్స్ (chicken lollipops) రెడీ.