రెస్టారెంట్ స్టైల్ బెండకాయ మసాలా.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
బెండకాయలు (Okra) ఆరోగ్యానికి ఎంతో మంచివి. బెండకాయలతో చేసుకునే వంటలు చాలా రుచిగా ఉంటాయి. బెండకాయ మసాలా కూరను రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే వండుకోవచ్చు. ఈ రెసిపీ తయారీ విధానం కూడా సులభం. మీ కుటుంబ సభ్యులకు ఈ రెసిపీ తప్పక నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం రెస్టారెంట్ స్టైల్ బెండకాయ మసాలా (Restaurant Style Okra Masala) రెసిపీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: పావు కిలో బెండకాయలు (Okra), సగం కప్పు పెరుగు (Curd), ఒక ఉల్లిపాయ (Onion), రెండు పచ్చిమిరపకాయలు (Chilies), రెండు టమోటాలు (Tomatoes), ఒకటిన్నర స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ (Kashmiri Chilli Powder), రుచికి సరిపడా ఉప్పు (Salt), సగం టేబుల్ స్పూన్ సెనగపిండి (Gram flour), ఒక స్పూన్ జీలకర్ర (Cumin).
ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), సగం స్పూన్ పసుపు (Turmeric), ఒక స్పూన్ ధనియాల పొడి (Coriander powder), సగం స్పూన్ గరం మసాలా (Garam masala), కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, నాలుగు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
తయారీ విధానం: ముందుగా బెండకాయలని శుభ్రపరచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలకు రుచికి సరిపడా ఉప్పు, సగం స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, సెనగపిండి వేసి బాగా కలుపుకోవాలి (Mix well). ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడెక్కిన తరువాత కలుపుకున్న బెండకాయ ముక్కలను వేసి తక్కువ మంట మీద ఫ్రై (Fry on low flame) చేసుకోవాలి.
బెండకాయలు ముప్పావు శాతం ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకునిపక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి అందులో నూనె (Oil) వేసి వేడెక్కిన తరువాత జీలకర్ర, ఉల్లిపాయ తరుగు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు (Onion) వేగిన తరువాత పచ్చిమిర్చి చీలికలు, చిటికెడు ఇంగువ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని మసాలాలన్నింటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో టమోటా పేస్ట్ (Tomato paste) వేసి కలుపుకొని మూత పెట్టి కూర నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. టమోటా పేస్ట్ బాగా మగ్గిన తరువాత పెరుగు (Curd) వేసి కలుపుకొని తక్కువ మంట మీద రెండు నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టి మరో ఐదు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
బెండకాయలు బాగా ఉడికిన తరువాత చివరిలో కొత్తిమీర (Coriander) తరుగు, గరం మసాలా (Garam masala) వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ బెండకాయ మసాలా రెడీ. ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ అన్నం రోటీల్లోకి భలే రుచిగా ఉంటుంది.