యోగాతో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందా.. పరిశోధకులు ఏం చెప్తున్నారు?
యోగ (Yoga) శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. మన నిత్య జీవితంలో ఎంత బిజీగా ఉన్నా రోజువారీ జీవన విధానంలో కొద్ది సమయాన్ని యోగాకు కేటాయిస్తే మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) కలుగుతాయి. యోగా శరీరంలోని అవయవాల పనితీరును మెరుగు పరిచేందుకు చక్కగా పని చేస్తుందని మాత్రమే మనకు తెలుసు. కానీ యోగాసనాలతో మన శరీరంలో జన్యుస్థాయిలో మార్పులు జరుగుతాయనే విషయం తెలియదు. తాజాగా ఒక సంస్థ చేపట్టిన అధ్యయనంలో యోగాతో పురుషులలో వీర్యకణాల సంఖ్య పెరుగుతాయని తేలింది. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా యోగాతో జన్యుస్థాయిలో వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాం..

మన నిత్య జీవితంలో ఉండే అలవాట్లు, జీవన శైలి, వాతావరణ పరిస్థితులు ఇవన్నీ మన శరీరంలోని జన్యువులను ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూంటాయి. ఆధునిక జీవన శైలిలో కొన్ని మార్పుల కారణంగా ఆరోగ్య సమస్యలు (Health problems) తలెత్తుతున్నాయి. వీటి కారణంగా ముఖ్యంగా సంతానలేమి సమస్యలు (Infertility problems) ఎక్కువ అవుతున్నాయి.
అయితే సంతానలేమి సమస్యకు కారణం మహిళలు అని చాలామంది అపోహపడుతుంటారు. అయితే పురుషుల బాధ్యత (Responsibility) కూడా ఇందులో ప్రధాన పాత్ర ఉందని వైద్యులు చెబుతున్నారు. పురుషులలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటంతో మహిళలు గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక వీర్యకణాల (Sperm) సంఖ్య పెరగడానికి చికిత్సలు తీసుకుంటుంటారు.
వీటి కారణంగా దుష్ప్రభావాలు (Side effects) ఉంటాయి. వీటికి బదులు రోజు కొద్ది సమయం ప్రాణాయామం, ధ్యానం చేస్తే సహజ సిద్ధమైన పద్ధతిలో పురుషులలో వీర్య కణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని ఒక సంస్థ చేపట్టిన అధ్యయనంలో తేలింది. ఈ సంస్థ వీర్యకణాలు తక్కువగా ఉన్నా 10 మంది పురుషులను ఎంపిక చేసి రోజువారితో గంటసేపు ప్రాణాయామం, ధ్యానం వంటి యోగాసనాలు (Yogasanas) చేయించారు.
కొద్దిరోజుల తర్వాత పరీక్షించగా అత్యాధునిక డీఎన్‌ఏ సీక్వెన్సింగ్ పద్ధతి ద్వారా జన్యు స్థాయిలో వీరిలో వచ్చిన మార్పులను పరీక్షించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న పురుషులలో యోగా (Yoga) తరువాత దాదాపు 400 జన్యువులలో మార్పులు వచ్చాయని వీటిలో దాదాపు 100 జన్యువులు (Genes) మన పునరుత్పత్తితో నేరుగా సంబంధం ఉన్నవే కావడం విశేషమని పరిశోధకులు తెలియజేశారు.
వీటిలో వచ్చిన మార్పుల కారణంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య కూడా పెరిగిందని తేలింది. కనుక యోగాకి వీర్యకణాల సంఖ్య పెరగడానికి మధ్య సంబంధం ఉందని కనుగొన్నారు. యోగ శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జన్యు స్థాయిలో మార్పులను తెస్తుంది. కనుక పురుషులలో వీర్య కణాల సంఖ్య పెరగడానికి యోగా తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. పురుషులలో వీర్యకణాల సంఖ్య పెరగడంతో శృంగార సామర్థ్యాన్ని, కోరికలను (Desires) పెంచుతాయి. పురుషులు నిత్యం యోగా చేస్తే వారిలో లైంగిక (Sexual) సామర్థ్యం పెరిగి భాగస్వామిని సంతోష పరచగలరు.