Men Health: ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. మగవారిలో సంతానలేమి సమస్యకు చెక్ పడ్డట్లే
సంతానలేమి అనేది కేవలం మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందనే భావన ఉండేది. అయితే ప్రస్తుతం పురుషులు సైతం ఈ సమస్య బారిన పడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే జీవన విధానంలో మార్పులతో పాటు కొన్ని ఫుడ్స్‌ను తీసుకోవాలి. మగవారిలో సంతాన సమస్యలకు చెక్ పెట్టేందుకు ఉపయోగపడే ఒక డ్రింక్ గురించి ఈ రోజు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
Men fertility
మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు కారణంగా చాలా మంది పురుషుల్లో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. ఊబకాయం, ఆల్కహాల్, స్మోకింగ్, ఎక్కువసేపు వేడి ప్రదేశాల్లో పనిచేయడం ఇలా రకరకాల అంశాలు సంతాన సమస్యలకు దారి తీస్తుంది. వీటివల్ల శుక్రకణాల నాణ్యత తగ్గడం లేదా చురుకుదనం తగ్గడం వంటి సమస్యలు వస్తున్నాయి.
అయితే పురుషుల్లో ఈ సమస్యకు చెక్ పెట్టడంలో ఒక మ్యాజిక్ డ్రింక్ ఎంతో పనిచేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రముఖ న్యూట్రిషియన్ అకౌంట్ 'ఫిట్‌మామ్ క్లబ్' పేజీలో ఈ జ్యూస్ తయారీకి సంబంధించిన వివరాలను అందించారు. ఇంతకీ ఏంటా డ్రింక్, దానిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
* గుమ్మడికాయ విత్తనాలు
* పుచ్చకాయ విత్తనాలు
* అవిసెగింజలు
* బాదం
* జీడిపప్పు
* అంజీర్
తయారీ విధానం:
పైన తెలిపిన వాటన్నింటినీ ఒక బౌల్‌లోకి తీసుకొని తగినంత నీరు పోయాలి. అనంతరం 7 నుంచి 8 గంటల వరకు నానబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసి, తగినంత నీటిని కలిపి గ్రైండ్ చేయాలి. అంతే జ్యూస్ రడీ అయినట్లే. ఇలా రెగ్యులర్‌గా తీసుకుంటే పురుషుల్లో సంతానలేమి సమస్యలు తగ్గుతాయి. శుక్రకణాలు సంఖ్య, నాణ్యత, చురుకుదనం పెరుగుతుంది. జ్యూస్ తయారీలో ఉపయోగించిన అన్ని డ్రై ఫ్రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి.?
డ్రైఫ్రూట్స్ పురుషుల్లో సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. డ్రైఫ్రూట్స్ పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచుతాయని కనుగొన్నారు. కనీసం రోజుకు 60 గ్రాముల డ్రైఫ్రూట్స్ తీసుకున్న వారిలో సంతాన సమస్యలు తగ్గినట్లు గుర్తించారు. పరిశోధనల్లో భాగంగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న సుమారు 223 మందిరి పరిగణలోకి తీసుకొన్నారు. వీరిలో డ్రై ఫ్రూట్స్ తీసుకున్న పురుషుల్లో శుక్రకణాల క్వాలిటీ, క్వాంటింటీ బాగున్నట్లు గుర్తించారు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.