Heart Attack: గ్యాస్ సమస్య అని వదిలేయకండి, ఉదయం ఈ 6 లక్షణాలు గుండెపోటుకు సంకేతం
Heart Attack: సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే, గుండె కండరాలు శాశ్వతంగా దెబ్బతినొచ్చు, మరణించే ప్రమాదం కూడా ఉంది. రక్తపోటు, రక్త కణాలలో మార్పుల కారణంగా ఉదయం పూట గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువని వైద్యులు చెబుతున్నారు.

ఆ ప్రమాదకర సంకేతాలు ఏవి?
ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మరణాలు గుండె జబ్బుల వల్లే సంభవిస్తున్నాయి. గుండెపోటు ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ మన శరీరం ముందుగానే కొన్ని సంకేతాలను పంపుతుంది. ముఖ్యంగా ఉదయం నిద్రలేచినప్పుడు కనిపించే కొన్ని మార్పులు రాబోయే ప్రమాదానికి సూచికలు కావచ్చు. ఆ ప్రమాదకర సంకేతాలు ఏంటో చూద్దాం.
ఆరు ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలు
గుండె కండరాలకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. దీనిని 'మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్' అంటారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే గుండె కండరం శాశ్వతంగా దెబ్బతినవచ్చు, మరణ ప్రమాదం ఉంది. రక్తపోటు, రక్త కణాల మార్పుల వల్ల ఉదయం పూట గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. నిద్రలేచిన తర్వాత కనిపించే ఆరు ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలు ఇవే.
ఛాతీలో అసౌకర్యం
ఉదయం ఛాతీలో ఒత్తిడి, బిగుతుగా లేదా మంటగా అనిపిస్తే, దాన్ని గ్యాస్ సమస్యగా పొరబడకండి. ఈ నొప్పి మీ మెడ, దవడ, వీపు లేదా చేతులకు వ్యాపిస్తే, వెంటనే వైద్య సహాయం తీసుకోండి.
అసాధారణ అలసట
నిద్రలేచిన తర్వాత కూడా చాలా అలసటగా అనిపించడం లేదా ఏ పని చేయాలన్నా నీరసంగా ఉండటం గుండెపోటుకు ముఖ్య లక్షణం. గుండెకు ఆక్సిజన్ డిమాండ్ పెరిగినప్పుడు ఈ రకమైన అలసట కలుగుతుంది.
శ్వాస ఆడకపోవడం
తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ, మేల్కొన్నప్పుడు అలసటగా అనిపిస్తే, అది గుండె వీక్ అయిందనడానికి సంకేతం. రక్తనాళాల్లో ఫలకం పేరుకుపోయినప్పుడు, గుండె రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ లక్షణం పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
చెమటలు వచ్చినా, తల తిరగడం
ఎలాంటి శ్రమ చేయకపోయినా చెమటలు పడితే అది ఆందోళన కలిగించే విషయమే. రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడినప్పుడు శరీరం ఒత్తిడికి గురై ఇలా ప్రతిస్పందిస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. అకస్మాత్తుగా తల తిరగడం లేదా కళ్లు తిరగడం అనేది గుండె నుండి మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతోందనడానికి సంకేతం. ఈ లక్షణం ఛాతీ నొప్పితో పాటు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.
వికారం
చాలామందికి ఉదయం పూట వికారంగా ఉంటుంది. దాన్ని జీర్ణ సమస్య అనుకుంటారు. కానీ గుండె సంబంధిత ఒత్తిడి కూడా వికారానికి కారణం కావచ్చు. ముఖ్యంగా భోజనం తర్వాత కూడా ఈ సమస్య కొనసాగితే వైద్యులను సంప్రదించాలి.
గుండెపోటు ఎప్పుడూ తీవ్రమైన ఛాతీ నొప్పితోనే రావాలని లేదు. ఈ చిన్న సంకేతాలను గుర్తించడం ద్వారా ప్రమాదకర పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

