యోని చుట్టూ ఎందుకు చెమట పడుతుంది?
యోని చుట్టూ చెమట పట్టడానికి వేడి, అపరిశుభ్రత మాత్రమే కారణం కాకపోవచ్చు. నిపుణులు ప్రకారం.. యోని చుట్టూ చెమట పట్టడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవేంటంటే..

చెమట అనేది ఒక సాధారణ విషయం. ముఖ్యంగా ఎండాకాలంలో చెమట ఎక్కువగా పడుతుంది. ముఖం, మెడ, చంకల్లో విపరీతమైన చెమట పడుతుంది. అంతేకాదు యోని చుట్టూ కూడా చెమట పడుతుంది. వేసవి తాపంతో పాటుగా ప్రైవేట్ భాగంలో చెమట పట్టడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మహిళలు యోని చుట్టూ చెమట పట్టడానికి కారణాలు
యోని చుట్టూ చెమట పట్టడమనేది ఒక సాధారణ శారీరక ప్రతిస్పందన. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, తేమను నిర్వహించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో చెమట పట్టడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవేంటంటే..
vaginal infection
శారీరక శ్రమ
వ్యాయామం లేదా ఆటలు వంటి శారీరక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల యోని ప్రాంతంతో సహా శరీరంలోని వివిధ భాగాలలో చెమట బాగా పడుతుంది. ఎందుకంటే శారీరక శ్రమ మన శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అయితే ఈ చెమట శరీరం చల్లబరచడానికి సహాయపడుతుంది. వ్యాయామం చేసేటప్పుడు యోని ప్రాంతానికి రక్త ప్రవాహం పెరుగుతుంది. ఇది చెమట పట్టేలా చేస్తుంది.
వేడి, తేమతో కూడిన వాతావరణం
అధిక ఉష్ణోగ్రతలు, తేమ ట్రిగ్గర్లుగా పనిచేస్తాయి. అలాగే యోనితో సహా శరీరమంతా ఇవి చెమటను పెంచుతాయి.
హార్మోన్ల మార్పులు
పీరియడ్స్, గర్భం, రుతువిరతి అంటూ వివిధ దశలలో హార్మోన్లలో హెచ్చుతగ్గులు వస్తాయి. ఇవి చెమట ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. కొంతమంది మహిళల్లో హార్మోన్ల మార్పుల కారణంగా ఈ సమయంలో యోని చుట్టూ చెమట విపరీతంగా పెరుగుతుంది.
vaginal infection
ఆందోళన, ఒత్తిడి
ప్రైవేట్ భాగంలో చెమట పట్టడానికి ఆందోళన, ఒత్తిడి కూడా కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఒత్తిడి శరీరంలోని వివిధ భాగాలలో చెమటను ప్రేరేపిస్తుంది. ఒత్తిడికి శరీరం ప్రతిస్పందనకు చెమట ఎక్కువగా పడుతుంది.
కొన్ని అనారోగ్య సమస్యలు
కొన్ని అనారోగ్య సమస్యలు కూడా యోని ప్రాంతంలో విపరీతంగా చెమట పట్టడానికి కారణమవుతాయి. హైపర్ హైడ్రోసిస్ (అధిక చెమట), బాక్టీరియల్ వాగినోసిస్ లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్లు లేదా హార్మోన్ల రుగ్మతలు వంటి కొన్ని సమస్యలు యోని చుట్టూ చెమట ఉత్పత్తి పెరగడానికి కారణమవుతాయి.
యోని హైపర్ హైడ్రోసిస్ అని పిలువబడే యోని చుట్టూ అధిక చెమట అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాగే ఇది అంతర్లీన సమస్యకు కూడా సంకేతం కావొచ్చు. దీనివల్ల మీకు అక్కడ తడిగా, చర్మపు చికాకుగా అనిపించొచ్చు. దీనివల్ల మీకు అంటువ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. జననేంద్రియ ప్రాంతంలో ఎక్కువ తేమ బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాల పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది బాక్టీరియల్ వాగినోసిస్ లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు దారితీస్తుంది.