యూరిక్ యాసిడ్ వల్ల ఇంత ప్రమాదమా? రాడిష్ తో చెక్ పెట్టండి ఇలా!
ఈ మధ్య చాలా మందిలో యూరిక్ యాసిడ్ సమస్య అధికంగా వస్తోంది. అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ఏం తినడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.

యూరిక్ యాసిడ్ మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థ పదార్థం. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువగా ఉంటే అది ప్రాణానికి కూాడా ప్రమాదం కావచ్చు. సాధారణంగా యూరిక్ యాసిడ్ ఎక్కువైతే అది కీళ్లపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల కీళ్లలో వాపు వంటి సమస్యలు వస్తాయి.
కీళ్ల సమస్యలు అధికం
నిజానికి యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల వస్తుంది. ప్యూరిన్ అనేది ఒక రకమైన సేంద్రీయ సమ్మేళనం. ఇది మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ఒకవేళ కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే అవి శరీరం నుంచి బయటకు వెళ్లలేక అక్కడే ఉండిపోతాయి. అవి శరీరంలో ఎక్కువై, కీళ్లలో పేరుకుపోతాయి. దీని కారణంగా కీళ్లలో నొప్పి, వాపు వస్తుంది. కొన్నిసార్లు నడవడం, కూర్చోవడం కష్టమవుతుంది.
ఎలా తగ్గించాలి?
కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల యూరిక్ యాసిడ్‌ని సులభంగా తగ్గించవచ్చు. అందులో ఒకటి ముల్లంగి. రాడిష్ తినడం ద్వారా శరీరంలోని యూరిక్ యాసిడ్‌ని సహజంగా తగ్గించవచ్చు. ముఖ్యంగా ఈ చలికాలంలో కీళ్లనొప్పులు ఉన్నవారికి ముల్లంగి దివ్య ఔషధం.
ముల్లంగి ప్రయోజనాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముల్లంగి యూరిక్ యాసిడ్‌కి మందు కాదు. కానీ యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి దోహదపడే కొన్ని లక్షణాలు దానిలో ఉన్నాయి. ముల్లంగిలో యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఈ సమ్మేళనాలు ప్యూరిన్ల పేరుకుపోవడాన్ని నిరోధించడానికి, ఆక్సలేట్ రాళ్లను తగ్గించడానికి, వాటిని తొలగించడానికి సహాయపడతాయి
ముల్లంగిలో ప్యూరిన్ స్థాయి చాలా తక్కువగా ఉండటం వల్ల, యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు దీన్ని ఇష్టమొచ్చినట్లు తినవచ్చు. అంతేకాకుండా ముల్లంగిలో ఉండే విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, ఇతర యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎముకలు, కండరాలు, కీళ్లలో వచ్చే నొప్పి, వాపును తగ్గించడానికి బాగా సాయపడతాయి. ముల్లంగిలో 90-95% నీరు ఉండటం వల్ల, ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా మూత్ర ఉత్పత్తిని కూడా పెంచుతుంది. దీనివల్ల యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా శరీరం నుంచు బయటకు వెళ్లిపోతుంది.
ఇలా తింటే మంచిది
- రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ముల్లంగి రసం తాగవచ్చు.
- ముల్లంగి తురుములో కొద్దిగా తేనె కలిపి రోజూ రెండుసార్లు తినవచ్చు.
- ముల్లంగితో కూర, అవియల్, పులుసు వంటివి కూడా చేసుకొని తినవచ్చు.
- ముల్లంగితో పరాటా కూడా చేసుకుని తినవచ్చు.