migraine రెండు నిమిషాల్లో మైగ్రేన్ మాయం.. ఇలా చేస్తేనే!
తలనొప్పి.. చిన్నదిగా కనిపించే భరించలేని పెద్ద సమస్య. అది తరచుగా వచ్చే మైగ్రేన్ అయితే ఆ బాధ వర్ణనాతీతం. ఇలాంటి తలనొప్పి వస్తోందా? ఈ సులువైన చిట్కాలు వాడితే వెంటనే ఉపశమనం పొందవచ్చు.

తక్షణ ఉపశమనం ఎలాగంటే..
సరిగ్గా నిద్రపోకపోయినా, ఎక్కువసేపు ఫోన్, టీవీ చూసినా, టైమ్‌కి తినకపోయినా వెంటనే తలనొప్పి వచ్చేస్తుంది. ఆ తలనొప్పి ప్రాణం పోయేలా ఉంటుంది. ఇక ఒళ్లంతా నొప్పులతో వచ్చే తలనొప్పి గురించి చెప్పక్కర్లేదు. ఎప్పుడు వస్తుందో, ఎందుకు వస్తుందో కూడా తెలీదు. వచ్చిందంటే నరకం చూపిస్తుంది. హాయిగా నిద్రపోనివ్వదు. కానీ.. ఈ తలనొప్పిని రెండు నిమిషాల్లో తగ్గించే మార్గాలను ఇప్పుడు చూద్దాం.
మాత్రలు వద్దు
తలనొప్పిని తగ్గించడానికి చాలామంది మాత్రలు వాడుతుంటారు. జండు బామ్ లాంటివి షాపుల్లో దొరుకుతాయి. ఎవరికి నచ్చిన బామ్ వాళ్లు వాడుతుంటారు. కొందరు మాత్రలు వేసుకుంటారు. కానీ, మందులు లేకుండా కూడా ఈ నొప్పిని తగ్గించొచ్చు.
ఏం చేయాలి?
తలనొప్పిని తగ్గించడానికి రెండు ఐస్ క్యూబ్స్ ఉంటే చాలు. ఈ రెండు క్యూబ్స్ త్వరగా తలనొప్పిని తగ్గిస్తాయి. వాటిని ఎలా వాడాలంటే.. రెండు ఐస్ క్యూబ్స్‌ను ఒక ప్లేట్‌లో పెట్టండి. ఈ రెండు ఐస్ క్యూబ్స్ మీద మీ బొటనవేలును పెట్టి మసాజ్ చేయండి. ఇలా రెండు నిమిషాలు చేస్తే తలనొప్పి తగ్గుతుంది.
సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు
మీకు తలనొప్పి ఉంటే ఇది ట్రై చేయండి. ఏ మందులు లేవు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా చేయడం వల్ల నా తలనొప్పి తగ్గిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బొటనవేలు నరాలు డైరెక్ట్‌గా తలకు కనెక్ట్ అయి ఉంటాయి. ఐస్ మీద బొటనవేలు పెట్టి మసాజ్ చేస్తే తలనొప్పి తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.