MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • గుడ్లను మరీ ఎక్కువగా తింటున్నరా? ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త..

గుడ్లను మరీ ఎక్కువగా తింటున్నరా? ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త..

మనలో చాలా మంది రోజూ గుడ్లను తింటారు. రోజుకు ఒక గుడ్డును తింటే మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు అందుతాయి. ఏదేమైనా గుడ్డును మరీ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Mahesh Rajamoni | Updated : Sep 12 2023, 07:15 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
egg

egg

గుడ్లను ఇష్టపడని వారు చాలా మందే ఉంటారు. గుడ్లను రకరకాల వండుకుని రోజూ తింటుంటారు కొందురు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ గుడ్లను తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతుంటారు. గుడ్లు ప్రోటీన్ కు మంచి వనరు. ఒక గుడ్డులో సుమారుగా 7 గ్రాముల అధిక-నాణ్యతకలిగిన ప్రోటీన్, 5 గ్రాముల మంచి కొవ్వుతో పాటుగా ఖనిజాలు, విటమిన్లు, ఇనుము వంటి ఎన్నో రకాల సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును తింటే మన శరీరంలో పోషకాల లోపమనేదే ఉండదు. 

25
Asianet Image

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గుడ్లు మన ఆరోగ్యానికి మంచే చేస్తాయి. అయినప్పటికీ.. వీటిని మరీ ఎక్కువగా తింటే కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిపుణుల ప్రకారం.. గుడ్లను ఎక్కువగా తింటే మీ జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల భరించలేని కడుపు నొప్పి వస్తుంది. గుడ్లను తింటే మీకు ఎలాంటి అలెర్జీ వచ్చినా.. మీరు గుడ్లకు దూరంగా ఉండటమే మేలు. ఎందుకంటే ఇది  సమస్యలను మరింత పెంచుతుంది. 
 

35
Asianet Image

గుడ్ల ప్రయోజనాలను పొందాలనుకుంటే వీటిని లిమిట్ లోనే తినాలి. కానీ చాలా మంది గుడ్లను మరీ ఎక్కువగా తింటుంటారు. ముఖ్యంగా పచ్చసొనను. ఇలా తినడం వల్ల బాగా బరువు పెరిగిపోతారు తెలుసా. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుడ్డులోని పచ్చసొనలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
 

45
Asianet Image

అంతేకాదు గుడ్లలో ఏవి తింటున్నారో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని ఆహారాలను గుడ్లతో అస్సలు తినకూడదు. అలాగే ఎన్ని గుడ్లను తింటున్నారో చూసుకోవాలి. అమృతం విషం అన్న సంగతి తెలిసే ఉంటుంది. గుడ్లు ఆరోగ్యానికి మంచివే అయినా.. ఎక్కువగా తీసుకుంటే మీకు ఎన్నో సమస్యలు వచ్చేలా చేస్తుంది. 
 

55
Asianet Image

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారంలో భాగంగా.. ప్రతిరోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు తినడం సురక్షితం. అయితే గుండె జబ్బులు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వారానికి మూడు గుడ్లును మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఆహారం
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories