50 ఏండ్లు దాటిన తర్వాత ఖచ్చితంగా చేయించుకోవాల్సిన మెడికల్ టెస్టులు ఇవే..
వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా అవసరం. ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి వంటివి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. అయితే ఈ వయసు వారు ఖచ్చితంగా కొన్ని హెల్త్ చెకప్ లు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. అలాగే ఎన్నో రోగాలు కూడా వస్తుంటాయి. అందుకే ఒక నిర్ధిష్ట వయస్సు వచ్చిన తర్వాత కొన్ని మెడికల్ టెస్టులు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 50 ఏండ్లు దాటిన వారు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటీస్
ఒక వయసు తర్వాత షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీన్ని గుర్తించడానికి ఒకసారి టెస్ట్ చేస్తే సరిపోదు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారైనా డయాబెటిస్ పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ వృద్ధులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
cholesterol
కొలెస్ట్రాల్
జీవనశైలి వ్యాధుల్లో చెడు కొలెస్ట్రాల్ ఒకటి. ఈ చెడు కొలెస్ట్రాల్ ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మీ కొలెస్ట్రాల్ ను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. కొలెస్ట్రాల్ పరీక్షలను కూడా క్రమం తప్పకుండా చేయాలి.
high blood pressure
అధిక రక్తపోటు
ఈ వయసు వారు అధిక రక్తపోటు పరీక్ష కూడా చేయించుకోవాలి. దీన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. బీపీ 50 దాటితే తరచూ చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ కు కారణమవుతుంది. అందుకే ఈ టెస్ట్ ను తప్పకుండా చేయించుకోవాలి.
<p>prostate cancer</p>
ప్రొస్టేట్ క్యాన్సర్
పురుషులు తప్పక చేయించుకోవాల్సిన మెడికల్ టెస్టులో ప్రొస్టేట్ క్యాన్సర్ ఒకటి. ప్రోస్టేట్ గ్రంథిని ప్రభావితం చేసే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం 50 ఏండ్లు పైబడిన వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి కూడా చెక్ పెట్టండి. క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకోండి.
kidney health
మూత్రపిండాల పరీక్ష
50 ఏండ్లు దాటిన వారు తమ మూత్రపిండాల పనితీరును అంచనా వేయడానికి మూత్రపిండాల పరీక్షను తప్పకుండా చేయించుకోవాలి. కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తిస్తే చాలా సమస్యలు తగ్గుతాయి.