ఇంట్లోనే పన్నీరు జిలేబీ ఎలా తయారు చెయ్యాలో తెలుసా?
పండుగ సమయాలలో, ఇంటికి వచ్చిన అతిథులకు సర్వ్ చేయడానికి వెరైటీగా స్వీట్ లను తయారు చేయాలనుకుంటే పన్నీర్ జిలేబీని ట్రై చేయండి. ఈ జిలేబీలు చక్కెర పాకంతో నిండి జ్యూసీగా భలే టేస్టీగా ఉంటాయి. ఈ స్వీట్ ఐటమ్ (Sweet item) మీ పిల్లలకు బాగా నచ్చుతుంది. ఎప్పుడు చేసుకునే జిలేబీలకు బదులుగా కాస్త వెరైటీగా పన్నీర్ తో జిలేబీలను ట్రై చేయండి. దీని తయారీ విధానం కూడా చాలా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా పన్నీరు జిలేబి (Paneer jilebi) స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: ఒక కప్పు తాజా పనీర్ (Paneer), ఒక టేబుల్ స్పూన్ మైదా (Maida), ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ (Corn flour), సగం స్పూన్ బేకింగ్ పౌడర్ (Baking powder), సగం స్పూన్ యాలకుల పొడి (cardamom powder), మూడు టేబుల్ స్పూన్ ల పాలు (Milk), సగం స్పూన్ గులాబీ ఎసెన్స్ (Pink Essence), కొద్దిగా కుంకుమ పువ్వు రేకులు (Saffron petals), చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ (Orange Food Color), ఒక కప్పు పంచదార (Sugar), ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil).
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు చక్కెర, సగం కప్పు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి పాకం (Caramel) తయారు చేసుకోవాలి. చక్కెర బాగా కరిగి తీగపాకం రావాలి. పాకం చివరిలో గులాబీ ఎసెన్స్, కుంకుమ పువ్వు రేకులు (Saffron petals), నీటిలో కలిపిన ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇలా తయారుచేసుకున్న పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరోక గిన్నెలో పొడి చేసుకున్న పన్నీర్, మొక్కజొన్న పిండి, మైదా, బేకింగ్ పౌడర్, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి (Mix well). ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి పాలు పోసి గ్రైండ్ (Grind) చేసుకోవాలి.
ఈ మిశ్రమం చిక్కని దోశ పిండిలా (Like a thick dough) ఉండాలి. అప్పుడే జిలేబీలు వేసుకోవడానికి పిండి అనువుగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కోన్ ఆకారంలో చుట్టుకున్న ప్లాస్టిక్ కవరులో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil) వేసి బాగా వేడి చేయాలి.
ఇప్పుడు కవరులో వేసుకున్న మిశ్రమాన్ని కాగుతున్న ఆయిల్ (Oil) లో జిలేబిల్లా వేసుకోవాలి. జిలేబీలు మంచి కలర్ వచ్చేవరకు రెండువైపులా వేయించుకోవాలి. ఇలా తయారైన జిలేబీలను చక్కెర పాకంలో వేయాలి. జిలేబీలకు పాకం పట్టిన తరువాత ఒక ప్లేట్ లో తీసుకొని సర్వ్ (Serve) చేయండి. అంతే ఎంతో రుచికరమైన పనీర్ జిలేబీలు రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ స్వీట్ ను ఒకసారి ట్రై చేయండి.