అతి ఆలోచనలు మిమ్మల్ని ఒంటరిని చేస్తయ్.. వీటిని ఇలా నియంత్రించండి
కొందరు అవసరానికి మించి ఆలోచనలు చేస్తుంటారు. కానీ ఈ ఆలోచనల వల్ల మీరు ఒంటరిగా ఫీలవుతారు. ఇది ఎన్నో మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఆలోచనలు ఎక్కువగా చేయకూడదు.

loneliness
మనలో ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకసారి ఒంటరిగా అనిపిస్తుంది. కానీ కొంతమంది ఎప్పుడూ లోన్లీగా ఫీలవుతుంటారు. కానీ ఇది వారి మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎంతమంది చుట్టూ ఉన్నా లోన్లీగా ఫీలవుతుంటారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒంటరితనం ఏ సమయంలోనైనా మిమ్మల్ని చుట్టుముట్టొచ్చు. ముఖ్యంగా ఒత్తిడి, యాంగ్జైటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒంటరిగా అనిపిస్తుంది.
ఒంటరితనం ఎందుకు ప్రమాదకరం?
ఒంటరితనం అంటే మీ భావాలను పంచుకోవడానికి ఎవరూ లేకపోవడం. మీ ముందు మీరు తప్ప మరెవరూ లేని మానసిక స్థితి. మీరు దేని గురించి బాధపడుతున్నారు? మీ మనస్సు దేనిగురించి ఏం ఆలోచిస్తోంది వంటి విషయాలన్నింటినీ పంచుకోవడానికి మీకు ఎవరూ కనిపించడం లేకపోవడం వల్లే ఒంటరిగా ఫీలవుతారు. ఇలాంటి పరిస్థితిలో మీ భావోద్వేగ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది మీ ఒత్తిడిని పెంచుతుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
loneliness
ఒంటరితనం కూడా మిమ్మల్ని అతిగా ఆలోచించేలా చేస్తుంది. ముఖ్యంగా ఇది మీలో నెగిటివిటీని పెంచుతుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మనస్సు ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తుంది. ఈ సమయంలో మీకు ప్రతికూల ఆలోచనలే తప్ప పాజిటీవ్ ఆలోచనలు అసలే రావు. ఇది ప్రమాదకరం.
మన ఆరోగ్యానికి నిద్ర చాలా చాలా ముఖ్యం. కానీ ఒంటరితనం నిద్ర లేమికి కారణమవుతుంది. ఒంటరితనం వల్ల మీరు రాత్రిపూట కంటినిండా నిద్రపోరు. అర్థరాత్రి కూడా మెలుకువగా ఉంటారు. ఇది మరుసటి రోజు మిమ్మల్ని డల్ గాచేస్తుంది. మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మరి ఒంటరితనం పోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇష్టమున్న పనులను చేయండి
మీకు కొత్త కొత్త వంటలు ట్రై చేయడం ఇష్టమున్నా, పెయింటింగ్ , డ్యాన్స్, సాంగ్స్ పాటం వంటివి ఏవి ఇష్టముంటే ఆ పనులను చేయండి. నచ్చిన పనుల్లో పాల్గొంటే మీకు మంచి అనుభూతి కలుగుతుంది. ఇది మీ ఒంటరితనాన్ని కూడా పోగొడుతుంది.
స్వీయ సంరక్షణ
మీకు ఒంటరిగా అనిపిస్తే స్వీయ సంరక్షణ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మీకు ఇష్టమైన కార్యకలాపాలలో పాల్గొనండి. ఇవన్నీ మిమ్మల్ని బిజీగా ఉంచి మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. వీటితో పాటు మానసిక ఆరోగ్యానికి, శారీరక, చర్మ ఆరోగ్యానికి కూడా ఈ కార్యకలాపాలన్నీ మేలు చేస్తాయి. అలాగే రాత్రిపూట ప్రశాంతంగా పడుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఏదైనా సామాజిక సేవలో పాల్గొనండి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. అలాగే మీ ఒంటరితనాన్ని కూడా పోగొడుతుంది.
ఒంటరితనం భావనను గుర్తించండి
ఏదైనా సమస్య నుంచి బయటపడాలంటే ఆ సమస్య గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ముందుగా మీ సమస్యేంటో తెలుసుకోండి. మీ ఒంటరితనాన్ని అంగీకరించండి. అలాగే మీ ఒంటరితనానికి కారణమేంటో తెలుసుకోండి. ఎందుకంటే చాలాసార్లు మనం ఎంతో మందితో ఉన్నా ఒంటరిగా ఫీలవుతుంటాం. అవసరమైతే వైద్య సహాయం కూడా తీసుకోండి.
స్నేహితులు, కుటుంబ సభ్యులు కనెక్ట్ అవ్వండి
"కాలం అన్నింటినీ నయం చేస్తుంది" అనే సామెతను వినే ఉంటారు. అందుకే కాలంతో పాటుగా ముందుకు సాగాలి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అలాగే మీ ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి మీరు తగిన చర్యలు తీసుకోగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఒంటరితనం పోవాలంటే ముందుగా మీరు చేయాల్సిన పని స్నేహితులు, కుటుంబ సభ్యులు, కొత్త వారికి కనెక్ట్ కావడానికి ప్రయత్నించండి.
ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు సోషల్ మీడియా కూడా మీకు సహాయపడుతుంది. కానీ సోషల్ మీడియా ను ఎక్కువగా ఉపయోగిస్తే మళ్లీ మీరు ఒంటరివారయ్యే అవకాశం ఉంది.