MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • బిస్కట్లే కాదు టీ తో వీటిని కూడా తినకూడదు.. తిన్నారంటే మీ పని అంతే..!

బిస్కట్లే కాదు టీ తో వీటిని కూడా తినకూడదు.. తిన్నారంటే మీ పని అంతే..!

పరిగడుపున టీ అస్సలు తాగకూడదు. ఎందుకంటే ఇది గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను కలిగిస్తుంది. అయితే టీ తో బిస్కట్లు, బ్రెడ్ ను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ టీతో పాటుగా కొన్ని ఫుడ్స్ ను అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 22 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మనమందరం టీతో పాటు ఏదో ఒకటి తింటుంటాం. చాలా మంది స్నాక్స్ లేకుండా టీ ని అస్సలు తాగరు. కానీ టీతో ఏదిపడితే అది తినకూడదు. ఎందుకంటే ఇది మన జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చేలా చేస్తుంది. అసలు టీతో పాటుగా వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పసుపు కలిగిన ఆహారాలు

పసుపు ఎక్కువగా ఉండే ఆహారాన్ని మర్చిపోయిన కూడా టీతో పాటు తినకూడదు. లేదంటే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పసుపు, టీ ఆకులు రెండూ ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటినీ కలపడం ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
 

36
international tea day

international tea day

నిమ్మరసం

నిమ్మరసం ఉన్న ఆహారాన్ని టీ తాగిన వెంటనే తీసుకోకూడదు. ఎందుకంటే టీ ఆకులు, నిమ్మరసం ఒకదానికొకటి కలిసి టీ ఆమ్లంగా మారుతుంది. దీని వల్ల ఉబ్బరం సమస్య వస్తుంది. అంతేకాదు ఇది యాసిడ్ రిఫ్లెక్స్, గుండెల్లో మంట వంటి సమస్యలను కలిగిస్తుంది.

46

ఐరన్ ఎక్కువగా ఉండే కూరగాయలు

ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే పాలకూర పకోడీలు వంటి కూరగాయలను టీతో కలిపి తినడం వల్ల శరీరంలో ఇనుము శోషణ పరిమితం అవుతుంది. టీలో ఉండే టానిన్లు, ఆక్సిలైట్ సమ్మేళనాలు శరీరంలో ఇనుము శోషణను నిరోధిస్తాయి. బ్లాక్ టీలో టానిన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది గ్రీన్ టీలో కూడా ఉంటుంది. ఇనుము ఎక్కువగా ఉండే కూరగాయలు, ధాన్యాలు, కాయలు, బీన్స్ వంటి ఇతర ఆహారాలను కూడా టీతో ఎప్పుడూ తీసుకోవద్దు. 

56

వేయించిన ఆహారాలు

సాధారణంగా టీ తో పాటు పకోడీలను తినే అలవాటు చాలా మందికే ఉంటుంది.ఈ కాంబినేషన్ టేస్టీగా అనిపిస్తుంది. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వేయించిన ఆహారాలు జీర్ణం కావడం చాలా కష్టం. వీటిని తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగానే ఉంటుంది. మీరు టీ, వేయించిన ఆహారాన్ని కలిపినప్పుడు ఇది మీ జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
 

66
tea and biscuit

tea and biscuit


బిస్కెట్లు

చాయ్ తో బిస్కట్లను తినే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. ఈ కాంబినేషన్ చాలా మంది రెగ్యులర్ డైట్ లో భాగం అవుతుంది. పిండి, పంచదారతో బిస్కెట్లను తయారుచేస్తారు. అయితే టీ లో అదనపు పంచదార, బిస్కట్లలోని మైదా జీర్ణ సంబంధ సమస్యలు వచ్చేలా చేస్తాయి. వీటి కలయిక ఎసిడిటీ మలబద్దకం ప్రమాదాన్ని పెంచుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved