Health Tips: ఒంటి నొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఈ వంటింటి చిట్కాలు మీకోసమే!
Health Tips: వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య అందరికీ ఒంటి నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. అయితే వీటి కోసం ఎక్కువగా మెడిసిన్ తీసుకోకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలా నొప్పులు తగ్గించుకోవచ్చో చూద్దాం.
ఇప్పుడు బాడీపెయిన్స్ కి వయసుతో సంబంధం లేదు. చిన్న వయసు నుంచి వయసు పైబడిన వారి వరకు అందరికీ నొప్పులు వస్తున్నాయి. అయితే ఇందులో కూడా చాలా రకాల నొప్పులు ఉన్నాయి. వీటిని తగ్గించుకోవటం కోసం హోమ్ రెమెడీస్ ని ప్రయత్నించడం ఉత్తమం.
ఎందుకంటే ఇవి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్. కాబట్టి ఏ నొప్పికి ఏ రెమిడి వాడాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అల్లం సంగతి చూద్దాం. నిజంగా ఇది ఒక మ్యాజికల్ హెర్బ్. ఇది జాయింట్ పెయిన్స్, వాపులు, స్టిఫ్ బోన్స్ ను నివారిస్తుంది. ఇందుకోసం ఫ్రెష్ గా ఉండే అల్లం ముక్కల్ని ఒక కాటన్ క్లాత్లో వేసి బాగా టైట్ గా ముడివేసి గిన్నెలో నీళ్ళు పోసి మరిగించండి.
మరిగించిన తర్వాత ఆ క్లాత్ ని నొప్పి ఉన్న ప్రదేశంలో ప్రెస్ చేస్తూ కాపడంలా వత్తి పెట్టుకోవాలి. ఇలా పదిహేను నిమిషాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే వంటి నొప్పుల కోసం పసుపు కూడా మంచి ఔషధం.
పాలను మరిగించి అందులో ఒక టీ స్పూన్ పసుపు వేసి వేడి చేసి వాటిని తీసుకోవటం వలన శరీరం లోపల ఇంటర్నల్ గా ఉన్న నొప్పులను నివారిస్తుంది. అలాగే ఇది మంచి పెయిన్ కిల్లర్ కూడా. అలాగే అరకప్పు వేడిపాలలో అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని, తేనెని మిక్స్ చేసే తాగటం వలన జాయింట్ పెయిన్ నివారించబడుతుంది.
ఆర్థరైటిస్ పెయిన్ కోసం దాల్చిన చెక్క మంచి ఔషధం. అలాగే ఎక్కువగా పని చేయడం వలన కండరాల మీద ఒత్తిడి పెరిగి ఒళ్ళు నొప్పులకు దారితీస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందటానికి కోల్డ్ షవర్ బాత్ అనేది బాగా పనిచేస్తుంది.
అలాగే కోల్డ్ కంప్రెసర్ వల్ల కూడా కండరాల స్టిఫ్నెస్ మరియు సోర్ నెస్ తగ్గుతుంది. అలాగే బాత్ టబ్ లో గోరువెచ్చని నీటిని ఫిల్ చేసి అందులో రెండు కప్పుల ఆపిల్ సైడర్ వెనిగర్ వెయ్యాలి. బాత్రూంలో కూర్చుని కొద్దిసేపు రిలాక్స్ అవ్వటం వలన ఒంటినొప్పులని నివారించవచ్చు.