ప్రెగ్నెన్సీ వల్లే కాదు వీటి వల్ల కూడా వాంతులు అవుతాయి? తగ్గాలంటే ఇలా చేయండి
కొంతమంది మెడిసిన్ కు దూరంగా ఉంటారు. అయితే మెసిడిన్ తో పాటుగా కొన్ని ఇంటి చిట్కాలతో ఎన్నో అనారోగ్య సమస్యలను అదుపులో పెట్టొచ్చు. వీటిలో వాంతులు ఒకటి. వాంతులు తగ్గడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.

వాతావరణ మార్పులు లేదా జర్నీ సమయంలో వాంతులు అవ్వడం సర్వ సాధారణం. నిజానికి ఈ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పులు మన శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అయితే వాంతులు ఆగాలని చాలా మంది వెంటనే మందులను వేసుకుంటుంటారు. అయితే ఈ మందులకు దూరంగా ఉండే వారు కూడా చాలా మందే ఉన్నారు. మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు వికారం, వాంతలను ఆపుతాయంటున్నారు నిపుణులు.
డీహైడ్రేషన్ సమస్యలు, శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల వాంతులు అవుతాయంటున్నారు నిపుణులు. దీనికి తోడు ఫుడ్ పాయిజనింగ్, భోజనం మానేయడం వల్ల శరీరంలో ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. దీనివల్ల వికారంగా అనిపిస్తుంది.
vomiting
వాంతులు ఇందుకు కూడా వస్తాయి
ఫుడ్ పాయిజనింగ్
అతిగా తినడం
ఒత్తిడి పెరగడం
ప్రెగ్నెన్సీ
మందును తాగడం
కడుపులో పుండ్లు
వాంతులను తగ్గించే ఇంటి చిట్కాలు
అల్లం నమలండి లేదా రసం తాగండి
అల్లం రసం వాంతుల సమస్యను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం అర టీస్పూన్ నిమ్మరసం, నల్ల ఉప్పు, అర టీస్పూన్ అల్లం రసాన్ని నీటిలో కలిపి తాగండి. ఇది మీ శరీరానికి మంచి మేలు చేస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. మీకు వాంతి వచ్చినట్టుగా అనిపిస్తే 1500 మి.గ్రా అల్లాన్ని తీసుకుని కాసేపు నమలండి. ఇందులో ఉండే జింజెరోల్ ఎలిమెంట్ వికారం సమస్యను తగ్గిస్తుందిి. అంతేకాకుండా ఫ్యాటీ లివర్, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పుదీనా టీ
ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పుదీనా టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని పరిమళం మన శరీరానికి, మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. అలాగే వాంతుల సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది. ఇందుకోసం పుదీనా ఆకులను 1 గ్లాసు నీటిలో మరిగించి నీరు సగం అయ్యాక కొద్దిగా చల్లారిన తర్వాత తాగండి.
జీలకర్ర నీరు
జీలకర్ర నీరు మన శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్ , యాంటీ మైక్రోబియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇలాంటి జీరావాటర్ మన శరీర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీన్ని నమలడం వల్ల శరీరంలో ఉండే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. జీలకర్ర బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇది జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
నల్ల మిరియాలు
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న నల్ల మిరియాలు కూడా వికారాన్ని తగ్గిస్తాయి. వీటిని నోట్లో వేసుకుంటే వాంతుల సమస్య తగ్గిపోతుంది. ఇది మీ శరీరాన్ని నిర్విషీకరణ చేయడమే కాకుండా టైప్ 2 డయాబెటిస్, కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. వీటితో పాటుగా నల్ల మిరియాల నూనెను ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. 3 నుంచి 4 గింజలను నోట్లో వేసుకుని కాసేపు అలాగే ఉంచాలి. వీటితో పాటుగా నల్ల మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్కను నీటిలో మరిగించి తాగితే కూడా వాంతులు కూడా ఆగిపోతాయి.
amla
ఎండు ఉసిరి
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరికాయ పుల్లగా ఉంటుంది. కడుపుకు మేలు చేసే ఈ ఔషధ పండును తినడం వల్ల మన శరీరం అనేక రకాల అలర్జీలు, ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటుంది. ఎండిన ఉసిరిని నమనడం వల్ల వాంతుల సమస్య తగ్గిపోతుంది.