పురుషులలో వృద్ధాప్యం తగ్గించే చిట్కాలు ఏంటో తెలుసా?
అందరిలో అందంగా యవ్వనంగా కనపడాలని మహిళలతో పాటు పురుషులు కూడా కోరుకుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ కాలుష్యం (Atmospheric pollution), ఆహారపు అలవాట్లలో మార్పు, వారి జీవన శైలిలోని కొన్ని చెడు అలవాట్లు కారణంగా చర్మ సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటి కారణంగా చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలను ఎదుర్కోవలసి వస్తోంది. చర్మంపై ముడతలు ఏర్పడి చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తున్నారు. అయితే మహిళలాగే పురుషులు కూడా చర్మ సౌందర్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. దీనికోసం పురుషులు కొన్ని ఆరోగ్యకరమైన టిప్స్ (Healthy Tips) ను అనుసరిస్తే యవ్వనంగా కనిపిస్తారు. అవేంటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

చర్మ సౌందర్యం (Skin beauty) కోసం ప్రతి రోజూ రెండు లీటర్ల నీటిని (Water) తాగడం తప్పనిసరి. శరీరానికి కావాల్సిన నీటిని అందించడంతో చర్మం తేమగా ఉండి ఆరోగ్యంగా ఉంటుంది. ఇది పురుషుల వృద్ధాప్య ఛాయలను తగ్గించే అద్భుతమైన హెల్త్ టిప్.
అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ (Green Leafy Vegetables) లను రెగ్యులర్ డైట్ లో తీసుకోవాలి. ఇవి చర్మంలోని ముడుతలను, ఏజింగ్ లక్షణాలను తగ్గించేందుకు సహాయపడతాయి. దీంతో పురుషులు యవ్వనంగా (Young) కనిపిస్తారు.
యవ్వనంగా కనిపించేందుకు ముఖ సౌందర్యం మాత్రం పెరిగితే సరిపోదు. దాని కోసం శరీరం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇందుకోసం రోజూ కొంత సమయం వ్యాయామం (Exercise) చేయడం అవసరం. వ్యాయామం శరీర కండరాలను (muscles) బలపరచి యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతుంది.
శరీరంలో రక్తప్రసరణ (Blood circulation) లోపం కూడా వృద్ధాప్య ఛాయలకు (Aging shade) కారణమవుతుంది. రక్త ప్రసరణ మెరుగుపరచడం కోసం బాడీ మసాజ్, ఫేస్ మసాజ్, హెడ్ మసాజ్ చేసుకోవడం మంచిది.
ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు పురుషులలో వృద్ధాప్య ఛాయలను పెంచుతాయి. ఈ చెడు అలవాట్ల (Bad habits) కారణంగా మీ ముఖంలో ముడతలు, పొడి చర్మం (Dry skin) వంటి సమస్యలు ఏర్పడతాయి. చర్మం నిర్జీవంగా మారి కాంతివిహీనంగా తయారవుతుంది.
ఈ లక్షణాల కారణంగా ముఖంలో వృద్ధాప్య ఛాయలు పెరుగుతాయి. పురుషులు అధిక మొత్తంలో మద్యం (Alcohol) సేవించడం కారణంగా శరీర కణాలలో ఆల్కహాల్ వ్యాపిస్తుంది. దాంతో చర్మ కణాలు (Skin cells) దెబ్బతింటాయి. వీటి కారణంగా చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.
పురుషులు రెగ్యులర్ గా తీసుకొనే డైట్ లోని పోషకాల లోపం (Nutrient deficiency) కూడా వారి చర్మ సౌందర్యంపై ప్రభావితం చూపుతాయి. అయితే పురుషులు చర్మసౌందర్యాన్ని పెంచేందుకు వారి డైట్ లో ద్రాక్ష రసాన్ని (Grape juice) తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ద్రాక్ష రసంలో అధిక మొత్తంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు (Antioxidants) చర్మానికి తగినంత పోషకాలను (Nutrients) అందించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. పురుషుల చర్మ సౌందర్యాన్ని యవ్వనంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు బయటకు వెళ్ళడానికి ముందు సన్ స్క్రీన్ లోషన్ (Sunscreen lotion) ను అప్లై చేసుకోవడం మంచిది. అలాగే చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా (Clean) ఉంచుకోవాలి.
ప్రతి రోజూ రెండుసార్లు ముఖానికి పాలతో (Milk) మర్దన (Massage) చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మకణాలలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి తొలగిపోయి చర్మం శుభ్రపడి యవ్వనంగా కనిపిస్తుంది.