Health Tips: ఊబకాయం వారసత్వంగా మాత్రమే వస్తుందా.. నిజా నిజాలు తెలుసుకోండి!
Health Tips: నేటి ఫాస్ట్ ఫుడ్ యుగంలో ఊబకాయంతో బాధపడుతున్నారు. అయితే ఊబకాయం వారసత్వంగా మాత్రమే వస్తుందని.. తినటం మానేస్తే ఊబకాయం తగ్గిపోతుందని చాలా అపోహలు ఊబకాయం మీద ఉన్నాయి. వాటి గురించి నిజా నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఆరోగ్యకరమైన తిండి మీద ఎవరు దృష్టి పెట్టడం లేదు. ఆ నిమిషానికి ఏది దొరికితే అది తిని పని కానిచ్చేస్తున్నారు. కానీ దాని వల్ల వచ్చే అనారోగ్యాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. దీనివలన చాలామంది ఊబకాయానికి గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 650 మిలియన్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు.
ఊబకాయం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. శారీరకంగా మానసికంగా కూడా ఉబకాయం చాలా ప్రమాదం. అలాంటి ఈ ఊబకాయం గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. భోజనం మానేస్తే ఊబకాయం తగ్గిపోతుందని చాలామంది అపోహ పడుతూ ఉంటారు.
కానీ అలా చేయడం చాలా ప్రమాదం. శరీరానికి అందవలసిన పోషకాలు అందక శరీర వ్యవస్థ గాడి తప్పుతుంది. అలాగే రోజువారి కార్యక్రమాలకు ఎనర్జీ సరిపోక నిరసించిపోతారు. కావలసినంత తినొచ్చు కానీ అందులో ఫ్యాట్ కంటెంట్ లేకుండా చూసుకోవాలి.
అలాగే తగినంత వ్యాయామం చేయాలి. అలాగే డయాబెటిస్ వల్ల ఊబకాయం వస్తుంది అని చాలామంది అనుకుంటున్నారు అయితే ఇది పూర్తిగా నిజం కాదు. ఊబకాయం వల్ల డయాబెటిస్ వస్తుంది కానీ ఊబకాయం ఉన్న ప్రతి ఒక్కరికి డయాబెటిస్ ఉండదు. అది వారి వారి శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది.
అలాగే ఒబిసిటీ వారసత్వంగా వస్తుంది అని చాలామంది అనుకుంటారు. అయితే దీనికి ప్రామాణిక ఆధారాలు ఏమీ లేవు. కొంతమంది తల్లిదండ్రులు సన్నగా ఉన్నా పిల్లలు మాత్రం ఊబకాయంతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఊబకాయంతో ఉన్న తల్లిదండ్రులకి నార్మల్ గా ఉన్న పిల్లలు పుడతారు. కాబట్టి ఊబకాయం వారసత్వంగా మాత్రమే వస్తుంది అనేది ఒట్టి అపోహ.
అలాగే ఊబకాయంతో ఉన్నవారు చాలా బద్ధకస్తులు ఏ పని చేసుకోలేరు అని చాలామంది అపోహ పడతారు. అది కూడా నిజం కాదు లావుగా ఉన్న చాలామంది చాలా యాక్టివ్ గా ఉంటూ అందరినీ ఆకర్షిస్తారు. అందుకు ఉదాహరణగా మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, బప్పిలహరి లాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు.