Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • అండాశయ క్యాన్సర్ గురించి వీటిని అస్సలు నమ్మకండి

అండాశయ క్యాన్సర్ గురించి వీటిని అస్సలు నమ్మకండి

అండాశయ క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే ఈ క్యాన్సర్ గురించి జనాలకు పూర్తిగా తెలియకపోడంతో దీని గురించిన అపోహలను కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారు.  

Mahesh Rajamoni | Published : Jun 04 2023, 03:52 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
ovarian cancer

ovarian cancer

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో క్యాన్సర్ సంబంధిత మరణాలకు అండాశయ క్యాన్సర్ ప్రధాన కారణాలలో ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం.. భారతదేశంలో ప్రతి లక్ష మంది మహిళలకు 11.9 అండాశయ క్యాన్సర్  ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం.. 2020లో భారతదేశంలో 33,447 కొత్త అండాశయ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. దేశంలోని అన్ని కొత్త క్యాన్సర్ కేసులలో 2.3% ఉన్నాయి. ఈ ప్రాణాంతక వ్యాధి గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. మహిళలు తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

26
Ovarian Cancer

Ovarian Cancer

అపోహ 1: అండాశయ క్యాన్సర్ వృద్ధ మహిళలను మాత్రమే ప్రభావితం చేస్తుంది

వాస్తవం: నిపుణుల ప్రకారం.. వృద్ధ మహిళలు మాత్రమే అండాశయ క్యాన్సర్ బారిన పడతారనే దానిలో కొంచెం కూడా నిజం లేదు. అండాశయ క్యాన్సర్ ప్రమాదం 50 ఏండ్లు పైబడిన మహిళలకే ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇది యువకులు, టీనేజర్లతో సహా అన్ని వయస్సుల మహిళలను ప్రభావితం చేస్తుంది. ఇతర దేశాల మాదిరిగానే భారతదేశంలో కూడా అండాశయ క్యాన్సర్ గరిష్ట వయస్సు 45 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉంది. అయినప్పటికీ అండాశయ క్యాన్సర్ ఏ వయసులోనైనా రావొచ్చు. చిన్న పిల్లలకు కూడా ఇది రావొచ్చు. అండాశయ క్యాన్సర్ ప్రమాదం వయస్సుతో పెరుగుతుంది. అయితే 50 ఏండ్లు పైబడిన మహిళలకే ఈ రిస్క్ పెరుగుతుంది. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగా భారతదేశంలో కూడా అండాశయ క్యాన్సర్ యువతులకు తక్కువగా వస్తుంది. కానీ వయస్సుతో పాటుగా ఈ వ్యాధి ప్రమాదం పెరుగుతుంది. 

36
Ovarian cancer

Ovarian cancer

అపోహ 2: అండాశయ క్యాన్సర్ ఎప్పుడూ కూడా పాప్ పరీక్ష ద్వారే గుర్తించబడుతుంది

వాస్తవం: అండాశయ క్యాన్సర్ ను గుర్తించడానికి పాప్ పరీక్షలు ఉపయోగబడవు. అండాశయ క్యాన్సర్ ను గుర్తించడానికి నమ్మదగిన స్క్రీనింగ్ పరీక్ష లేదు. ప్రస్తుతం అండాశయ క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించే సాధారణ టెస్ట్ లేదు. అండాశయ చుట్టుపక్కల కణజాలాలు, అవయవాలకు వ్యాధి అభివృద్ధి చెందినప్పుడు ఈ క్యాన్సర్ ను చాలా మంది ఆడవారు గుర్తిస్తారు. కటి పరీక్షతో పాటుగా అండాశయ క్యాన్సర్ కోసం సాధారణంగా రెండు పద్దతులను ఉపయోగిస్తారు. ఒకటి ట్రాన్స్వాజినల్ అల్ట్రాసౌండ్ (టివియుఎస్), రెండు సిఎ -125 రక్త పరీక్ష. ఇది క్యాన్సర్ లో  రెండో దశకు చేరుకున్న తర్వాత గుర్తిస్తుంది. అయితే అండాశయ క్యాన్సర్ లక్షణాలు మీలో కనిపిస్తే  క్రమం తప్పకుండా లేదా కటి పరీక్ష చేయించుకోండి. 
 

46
Asianet Image

అపోహ 3: అన్ని అండాశయ తిత్తులు ఒక రకమైన అండాశయ క్యాన్సర్

వాస్తవం: దీన్ని చాలా మంది నమ్ముతుంటారు. కానీ అండాశయ క్యాన్సర్, అండాశయ తిత్తుల మధ్య చాలా తేడా ఉంది. అండాశయ తిత్తులలో ఎక్కువ భాగం నిరపాయమైనవి, హానిచేయనివి. ఫంక్షనల్ తిత్తులు అని పిలువబడే సాధారణ రుతుచక్రం సమయంలో ఏర్పడే అనేక తిత్తులు క్యాన్సర్ లేనివి. ఇవి వాటంతట అవే పోతాయి. అండాశయాల చుట్టూ అనేక నిరపాయమైన తిత్తులు కూడా ఏర్పడతాయి. ఈ తిత్తులు సాధారణంగా స్వయంగా పోతాయి. అలాగే అండాశయ క్యాన్సర్ కణాల లోపల అభివృద్ధి చెందుతుంది. ఇది ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ లేదా గుడ్లను తయారు చేసే కణాలలో, అలాగే ఫెలోపియన్ గొట్టాలలో కనిపిస్తుంది.

56
ovarian cancer

ovarian cancer

అపోహ 4: అండాశయ క్యాన్సర్ ఎప్పుడూ వంశపారంపర్యంగా వస్తుంది

వాస్తవం: అండాశయ క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చినప్పటికీ.. ఇది ఇతర కారణాల వల్ల కూడా వస్తతుంది. అంటే వీటికి జన్యుపరమైన కారణం లేదు. అండాశయ క్యాన్సర్లలో 10-15% మాత్రమే బీఆర్సిఎ 1, బిఆర్సిఎ 2 వంటి వారసత్వ జన్యు ఉత్పరివర్తనాలతో ముడిపడి ఉన్నాయి. కుటుంబ చరిత్రతో సంబంధం లేకుండా ఎవరికైనా అండాశయ క్యాన్సర్ రావొచ్చు. వయస్సు, ఎండోమెట్రియోసిస్, స్మోకింగ్, అధునాతన గర్భం అండాశయ క్యాన్సర్ కు ప్రధాన ప్రమాద కారకాలు. అండాశయ క్యాన్సర్ కు ప్రమాద కారకాలు.. కుటుంబ చరిత్ర, కొన్ని జన్యు ఉత్పరివర్తనలు, రుతువిరతి ప్రారంభ వయస్సు, ఆలస్యంగా రుతువిరతి, వంధ్యత్వం లేదా గర్భం దాల్చకపోవడం, హార్మోన్ల చికిత్స వాడకం, ఊబకాయం, ధూమపానం వంటి కొన్ని జీవనశైలి కారకాలు కూడా అండాశయ క్యాన్సర్ కు దారితీస్తాయి. 
 

66
ovarian cancer

ovarian cancer

అపోహ 5: మహిళల్లో అండాశయ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు కనిపించవు

వాస్తవం: అండాశయ క్యాన్సర్ ఉన్న మహిళలకు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు అనేది ఒక సాధారణ అపోహ మాత్రమే. అండాశయ క్యాన్సర్ ఎన్నో లక్షణాలను చూపిస్తుంది. అయినప్పటికీ  వాటిని గుర్తించడం చాలా కష్టం. కడుపులో ఎప్పుడూ ఉబ్బరం లేదా వాపు, మలబద్ధకం లేదా విరేచనాలు ఆకస్మిక మార్పులు, మూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు, కటి లేదా కడుపు నొప్పి లేదా ఒత్తిడి వంటి లక్షణాలను మహిళలు విస్మరించకూడదు. అలాగే లైంగిక సంపర్కం సమయంలో నొప్పి కూడా అండాశయ క్యాన్సర్ సంకేతాలే. 
 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories