కండ్లకలక వచ్చిన వారి కండ్లను చూస్తే కూడా ఈ వ్యాధి సోకుతుందా?
ప్రస్తుతం కండ్లకలక కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలోనే జనాల్లో ఎన్నో అపోహలు కూడా పుట్టుకొస్తున్నాయి. మరి ఏది నిజం.. ఏది అవాస్తమో ఇప్పుడు తెలుసుకుందాం..

Conjunctivitis
ప్రస్తుతం ఢిల్లీతో సహా దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో కండ్లకలక కేసులు బాగా పెరిగిపోయాయి. అయితే దీని గురించి సామాన్యుల మదిలో ఎన్నో అపోహలు పుట్టుకొచ్చాయి. ‘కండ్లకలక’తో బాధపడుతున్న రోగి కళ్లలోకి చూడటం వల్ల ఈ వ్యాధి మనకు వస్తుందని నమ్మే వారు చాలా మందే ఉన్నారు. అంతేకాదు ఇది దానంతట అదే నయమవుతుందని నమ్ముతారు. మరి ఈ అపోహలు, పుకార్లలో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.
conjunctivitis
కళ్ళలో కండ్లకలక వ్యాప్తికి కారణమేంటి?
ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటే 'కండ్లకలక' అంటే ఐ ఫ్లూ వస్తుందనే దాంట్లో ఇంతకూడా నిజంలేదంటున్నారు నిపుణులు. కండ్లకలక ఎవరినీ చూసినా వ్యాపించదు. కానీ ఈ సమస్య ఉన్నవారి కంటి నుంచి వచ్చే కన్నీళ్ల ద్వారా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటే అతని కళ్లలోకి చూసినంత మాత్రానా మీకు ఈ ఐఫ్లూ రాదు కాబట్టి భయపడాల్సిన పనిలేదు.
కండ్లకలకకు చికిత్స అవసరం లేదా?
కండ్లకలక గురించి ఉన్న మరో అపోహ ఈ వ్యాధికి చికిత్స లేదు. ఎందుకంటే ఇది స్వయంగా నయమవుతుంది. నిపుణుల ప్రకారం.. కళ్లు మన శరీరంలోని చాలా సున్నితమైన భాగం. వీటిలో ఏ మార్పును కూడా తేలిగ్గా తీసుకోకూడదు. అందుకే కండ్లకలక వస్తే హాస్పటల్ కు వెళ్లాలి.
Image: Getty
కండ్లకలక తేలికపాటి ఇన్ఫెక్షన్ అని నిపుణులు అంటున్నారు. దీనికి తప్పకుండా చికిత్స చేయించుకోవాలి. నిజానికి ఈ వ్యాధి కొన్ని రోజుల్లోనే నయమవుతుంది. అయితే ఒకసారి వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. మీ కళ్లలో ఏ రకమైన అసౌకర్యం, వాపు లేదా చాలా ఎరుపు ఉంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి.
సొంతవైద్యం వద్దు
మీ కళ్లు ఎర్రగా ఉన్నా,, ఐ-ఫ్లూ వంటి సమస్యలు ఉన్నా ముందుగా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. ఏదైనా మెడికల్ స్టోర్ నుంచి ఐ డ్రాప్స్ లేదా ఇతర మందులను వాటడం వంటివి చేయకండి. మీ సొంతవైద్యం మీ సమస్యను మరింత పెంచుతుంది. అసలు సమస్యఏంటో డాక్టర్ ను అడిగి తెలుసుకోవాలి. అయితే ఎన్నో కంటి సమస్యల లక్షణాలు కూడా ఐ-ఫ్లూ మాదిరిగానే ఉంటాయి. కానీ అది కంటి-ఫ్లూ కాదు. ఇతర వ్యాధులు కావొచ్చు. అందుకే హాస్పటల్ కు వెళ్లడం మంంచిది.
కండ్లకలక లక్షణాలు
కండ్లకలక సాధారణ లక్షణాలు.. కళ్లలో దురద, మంట, ఎరుపు, కళ్ల నుంచి నీళ్లు కారడం, కొన్నిసార్లు కళ్ల నుంచి చీము రావడం, కాంటాక్ట్ లెన్సులతో అసౌకర్యంగా అనిపించడం, అలాగే కనురెప్పలు అంటుకోవడం.
కండ్లకలక ఎందుకు వస్తుంది?
కండ్లకలక వర్షాకాలంలోనే ఎక్కువగా వస్తుంది. నిజానికి వర్షాకాలంలోని తేమ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల అన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్లు బాగాపెరుగుతాయి. ఈ బ్యాక్టీరియా, వైరస్లు 'కండ్లకలక'తో సహా అన్ని రకాల వ్యాధులకు కారణమవుతాయి.