మహిళలు 35 ఏళ్ల తర్వాత గర్భం వస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి?
సాధారణంగా ప్రతి ఒక్క మహిళ అమ్మ కావాలని ఎంతో ఆరాటపడుతుంటారు అయితే కొంతమందికి అతి చిన్న వయసులోనే పిల్లలు కాగా మరి కొంతమంది పిల్లల కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఆ కోరిక నెరవేరకుండా ఉంటుంది.

ఇలా చాలా మందిలో పిల్లలు ఆలస్యంగా పుడుతూ ఉంటారు. ఇకపోతే వయసు పై పడేకొద్దీ గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.ప్రస్తుత కాలంలో 30 సంవత్సరాలకు పైబడి కూడా పిల్లలను కనడానికి ఆసక్తి చూపిస్తున్నారు అయితే 35 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలకు జన్మనిచ్చే తల్లులు తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోవాలి.
ప్రస్తుత కాలంలో ఉద్యోగం సంపాదన మీద పడి పిల్లలను చాలా ఆలస్యంగా ప్లాన్ చేస్తున్నారు.అలాగే కొంతమంది పిల్లలు కావాలన్నా కొన్ని అనారోగ్య సమస్యలు కారణంగా పిల్లలు వయసు పైబడిన తర్వాత పుట్టడం జరుగుతుంది. ఈ విధంగా 35 సంవత్సరాల తర్వాత మహిళ గర్భం దాల్చితే ఆ ప్రెగ్నెన్సీని గెరియాట్రిక్ ప్రెగ్నెన్సీ అంటారు.ఇలా వయసు పెరిగే కొద్దీ గర్భధారణ జరిగితే అది తల్లి బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదకరమని డాక్టర్లు సూచిస్తున్నారు.
35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చే మహిళలలో ఎక్కువగా బీపీ షుగర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందిలో బిడ్డ నెలలు పూర్తికాకుండానే జన్మించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం క్రోమోజోముల రుగ్మతతో బాధపడటం వంటివి జరుగుతుంటాయి.ఇక చాలా ఆలస్యంగా పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఆ పిల్లలు చదువుతోపాటు ఆర్థికంగా ఎంతో దృఢంగా ఉంటారని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
ఇక లేటు వయసులో గర్భం దాల్చిన మహిళలు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. గర్భం దాల్చిన మొదటి రెండు నెలలు ఎంతో కీలకము కనుక ఆ సమయంలో ఏం చేయాలి అనే విషయాలను డాక్టర్ ను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించాలి. వయసు పై బడే కొద్దీ మహిళలలోశక్తి సామర్ధ్యాలు తగ్గుతాయి కనుక వీలైనంతవరకు పోలిక్ యాసిడ్ విటమిన్స్ ఐరన్ క్యాప్సిల్స్ వేసుకోవడం ఎంతో మంచిది. ఇది బిడ్డ ఎదుగుదలకు కూడా దోహదపడుతుంది. రోజుకు 600 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ ఎంతో అవసరం అవుతుంది.
ఇలా డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ బలమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. వీలైనంతవరకు మాంసం గుడ్లు చేపలు, తృణధాన్యాలు బ్రోకలీ వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇక గర్భం దాల్చిన మహిళలు డెలివరీ అయ్యేలోపు సుమారు 12 కేసుల వరకు బరువు పెరగాలి.35 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మహిళలు రోజుకు కనీసం ఓ అరగంటకు పైగా వాకింగ్ చేయడం ఎంతో మంచిది. ఇక మద్యం స్మోకింగ్ వంటి అలవాట్లు ఉంటే ముందు వాటికి దూరంగా ఉండాలి.