సోరియాసిస్ వ్యాధి రావడానికి కారణాలు.. రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే!
సోరియాసిస్ (Psoriasis) వ్యాధి వచ్చినప్పుడు చాలామంది చిన్న సమస్యనే కదా అని నిర్లక్ష్యం చేస్తుంటారు.
- FB
- TW
- Linkdin
Follow Us

ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే చర్మంతో పాటు శరీరంలోని ఇతర అవయవాలకు కూడా ముప్పు ఉందని వైద్యులు అంటున్నారు. ఈ వ్యాధిని ముందుగా గుర్తించి వైద్యుని సలహా మేరకు మందులను వాడుతూ తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తలను (Precautions) పాటిస్తే ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చని వైద్యులు అంటున్నారు. అదేలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సోరియాసిస్ వ్యాధి ఒకసారి వచ్చిందంటే మధుమేహంలాగా జీవితాంతం ఉంటుంది. ఈ వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చు కానీ శాశ్వత పరిష్కారం లేదు. ఈ వ్యాధి రావడానికి ముఖ్య కారణాలు మానసిక ఒత్తిడి, ఇన్ఫెక్షన్లు (Infections), పౌష్టికాహార లోపం, వివిధ రకాల సబ్బుల వాడకం, మందుల వాడకం, జన్యుపరమైన కారణాలు (Genetic causes). ఈ వ్యాధి వచ్చినప్పుడు చర్మంపై ఎర్రగా దద్దుర్లు ఏర్పడి తెల్లటి పొట్టు ఏర్పడుతుంది. ఈ చర్మ సమస్యను సోరియాసిస్ గా గుర్తించాలి.
ఈ సమస్య కారణంగా దురద (Itching), మంట, చికాకు (Irritation) వంటి సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. ఈ వ్యాధి ముఖ్యంగా తల, పాదాలు, చేతులు, మెడ భాగాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పి, వేళ్ల నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి. ఈ వ్యాధి తీవ్రతను తగ్గించుకొనేందుకు సరైన జీవనశైలిని అనుసరిస్తూ తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి.
ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు గుండె జబ్బులు (Heart diseases), కిడ్నీ సమస్యలు (Kidney problems), డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కనుక ఈ వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యుడిని సంప్రదించి మందుల వాడకంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగానూ, ప్రోటీన్లు ఎక్కువగానూ ఉన్న మాంసాహారం ధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
అలాగే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) ఎక్కువగా ఉండే విటమిన్ సి, విటమిన్ ఈ, బీటా కెరోటిన్, సెలీనియం వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాక్సిడెంట్లు (Omega 3 fatty acids) అధికంగా ఉండే సాల్మన్ చేపలను తీసుకుంటే సోరియాసిస్ వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే చెర్రీ, బ్లూ బెర్రీ, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. వీటితోపాటు జీలకర్ర, అల్లం కూడా సోరియాసిస్ వ్యాధి నివారణకు సహాయపడతాయి.
జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్స్ లకు దూరంగా ఉండాలి. శారీరిక శ్రమ తగ్గడంతో శరీరం బరువు పెరిగి సోరియాసిస్ వ్యాధికి కూడా కారణం అవుతుంది. అధిక బరువు (Overweight) ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా సేవించే వారిలో ఈ వ్యాధి నియంత్రణ కాదు. సోరియాసిస్ ఉన్న ప్రదేశంలో కొబ్బరినూనెను (Coconut oil) తరచూ రాస్తే వ్యాధి తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది.
ఈ వ్యాధి ఉన్నప్పుడు తరచూ చేతులు కడుక్కోవడం, సబ్బుల వాడకం తగ్గించాలి. చేతులకు గ్లౌజ్ లు వేసుకొని వంట చేయాలి. ఇలా కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ.. శరీరానికి శారీరిక శ్రమను (Physical exertion) అందిస్తూ.. సరైన జీవనశైలిని పాటిస్తూ.. తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త పాటిస్తే.. ఈ వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చు.. దీంతో ఆరోగ్యకరమైన జీవన శైలిని (Healthy lifestyle) గడపవచ్చు.