ఒత్తిడితో శరీరంలోని అవయవాలకు ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
మన మనసులో పుట్టే ఆవేశం, ఆందోళన, ఆవేదన, కోపం వంటి భావోద్వేగాలే మన శరీరంపై ప్రభావితం చూపి ఒత్తిడికి కారణం అవుతాయి.

మానసిక ఒత్తిడిని (Stress) చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్య శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావితం చూపుతుంది. దీంతో అవయవాల ఆరోగ్యానికి (Health of organs) ముప్పు వాటిల్లుతుందని వైద్యులు అంటున్నారు. మరి ఈ ఒత్తిడి కారణంగా శరీరంలోని ఏ ఏ అవయవాలు ప్రభావితం అవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ పని ఒత్తిడి వంటి ఇతర సమస్యల కారణంగా ఎక్కువగా ఆలోచించి (Think) శరీరం ఒత్తిడికి గురవుతుంది. ఈ సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకుండా వాటి నివారణకు గల పరిష్కారం మీద దృష్టి పెట్టాలి. అప్పుడే శరీరానికి విశ్రాంతి కలుగుతుంది. ఈ సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు శరీరం దీర్ఘకాలిక ఒత్తిడికి గురై తట్టుకోలేని స్థాయిలో స్పందిస్తుంది. దీంతో అవయవాల మీద ప్రభావం (Effect on organs) పడుతుంది.
ఇలా ఒత్తిడికి గురైనప్పుడు మొదటగా మెదడుపై ప్రభావితం చూపుతుంది. దీంతో తలనొప్పి, చిన్న విషయానికే కోపగించుకోవడం, ఆలోచన శక్తి తగ్గడం, నిరాశ, ఆందోళన, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఈ సమస్య గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది (Harms heart health). దీంతో గుండెపోటు, గుండె కొట్టుకునే వేగం పెరగడం, పక్షపాతం వంటి ఇతర సమస్యలు ఏర్పడతాయి. శరీరం దీర్ఘకాలిక ఒత్తిడికి గురైనప్పుడు క్రోమగ్రంథి నుండి ఇన్సులిన్ (Insulin) ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
దీంతో మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఒత్తిడి సమస్య కారణంగా శరీర రోగనిరోధక శక్తి (Immunity) తగ్గిపోతుంది. దీంతో శరీరానికి ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. అలాగే మొటిమలు, దురదలు, ఎలర్జీ వంటి చర్మ సమస్యలు (Skin problems) ఏర్పడతాయి. ఇది సోరియాసిస్ సమస్యకు కూడా దారితీస్తుంది. ఈ సమస్య జీర్ణవ్యవస్థ మీద కూడా ప్రభావితం చూపుతుంది.
దీంతో కడుపు నొప్పి, ఆకలి మందగించడం, అతిగా తినడం, అజీర్తి, వికారం, గ్యాస్ వంటి ఉదరసంబంధిత సమస్యలు (Abdominal problems) కూడా ఏర్పడుతాయి. దీంతో ఉదర ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే మలబద్ధక సమస్యలు కూడా ఏర్పడతాయి. ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగితే మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను శరీరం పూర్తిగా గ్రహించలేదు. దీంతో జీవక్రియల వేగం తగ్గుతుంది.
అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి. ఈ సమస్య అధికంగా ఉన్నప్పుడు స్త్రీ, పురుషులలో లైంగిక కోరికలు తగ్గి (Decreased sexual desire) శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుంది. వారిలో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో సంతాన సామర్థ్యం తగ్గిపోతుంది (Fertility decreases). కనుక ఒత్తిడి సమస్యను సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయరాదు. ఈ సమస్య తీవ్రత అధికంగా ఉంటే డాక్టర్ ను సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది.