- Home
- Life
- Health
- ఎంత ట్రై చేసిన నిద్ర రావడం లేదా.. అయితే మీరు ఈ తప్పులు చేస్తూన్నట్టే.. అవేంటో తెలుసుకోండి!
ఎంత ట్రై చేసిన నిద్ర రావడం లేదా.. అయితే మీరు ఈ తప్పులు చేస్తూన్నట్టే.. అవేంటో తెలుసుకోండి!
ప్రస్తుత కాలంలో చాలామంది నిద్రలేమి (Insomnia) సమస్యతో సతమతమవుతున్నారు. వారికి తెలియకుండానే నిద్ర వల్ల ఇబ్బందులు పడుతున్నారు..

శారీరక, మానసిక సమస్యలు, పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఇలా అనేక కారణాలతో నిద్రకు దూరమవుతూ అనేక అనారోగ్య సమస్యలను (Illness issues) ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు తప్పనిసరి.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శరీరంలోని అనేక అనారోగ్య సమస్యలకు నిద్ర బాగా పట్టకపోవడమే (Sleep deprivation) ముఖ్య కారణమని వైద్యులు అంటున్నారు. ప్రతి రోజూ సరైన సమయానికి నిద్రపోయే అలవాటు (Habit) చేసుకోవాలి. ఇలా నిద్రకు సరైన సమయాన్ని పాటిస్తే కొన్ని రోజులకు మన శరీరం ఆ సమయానికి అలవాటు పడిపోతుంది. దీంతో సరైన సమయానికి మీకు నిద్ర వస్తుంది.
బెడ్ రూమ్ వాతావరణం కూడా నిద్ర రాకపోవడానికి కారణం. కనుక బెడ్ రూమ్ ను ప్రశాంతంగా (Calm down), ఆహ్లాదంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా బెడ్ రూమ్ లో టీ.వీ, సౌండ్ సిస్టమ్స్ ఉండకుండా చూసుకోవాలి. ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయి (Disturb sleep). అలాగే బెడ్ రూమ్ గోడలకు వేసే రంగు ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి.
బెడ్ రూం లోపల గోడలకు లేతరంగులు ఉండేలా చూసుకోవాలి. అలాగే మనసుకు నచ్చిన సంగీతాన్ని తక్కువ సౌండ్ తో వింటూ మనసును ఆహ్లాదంగా ఉంచుకోవాలి. ఇలా చేస్తే ఒత్తిడి (Stress), ఆందోళన (Anxiety) సమస్యలు తగ్గి నిద్ర బాగా పడుతుంది. పడుకునే ముందు తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి.
నిద్రకు ముందు కాఫీ, టీ వంటి వాటిని తీసుకోరాదు. ఎందుకంటే ఇందులో ఉండే కెఫిన్ (Caffeine) శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. దీంతో త్వరగా నిద్రరాదు. అలాగే మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. నిద్రించడానికి ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే శరీర అలసట (Fatigue) తగ్గి శరీరం తేలికపడుతుంది. దీంతో గాఢ నిద్రలోకి జారుకుంటారు.
అలాగే పడుకునే ముందు గోరు వెచ్చటి పాలను (Milk) తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. చాలామంది నిద్ర ఆరోగ్యానికి మంచిదని పగటిపూట ఎక్కువసేపు నిద్రిస్తారు. దీంతో రాత్రి సరైన సమయానికి నిద్ర రాదు. కనుక పగటి నిద్రకు స్వస్తి (Termination) చెప్పి వీలైనంత వరకు రాత్రి పూట నిద్రపోవడానికి ప్రయత్నించాలి.
మనం భోజనం చేసే సమయం కూడా నిద్ర పట్టకపోవడానికి ముఖ్య కారణం. కనుక పడుకోవడానికి రెండు గంటలు ముందుగానే భోజనాన్ని ముగించే అలవాటు చేసుకోవాలి. తిన్న వెంటనే నిద్రిస్తే అది ఆరోగ్యానికి మంచిది కాదు (Not good for health). ఇలా తిన్న వెంటనే (Immediately) నిద్రిస్తే నిద్రపట్టక అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
నిద్ర అనేది మన ఆరోగ్యానికి (Health) చాలా ముఖ్యము. మనం నిద్రించేటప్పుడు మన శరీరంలోని అవయవాలన్నీ విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు హుషారుగా (Wisely) ఉండేందుకు సహాయపడుతాయి. కనుక నిద్రకు సరైన సమయాన్ని కేటాయిస్తే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.